Home / health / అన్నం, గోధుమ రొట్టెలు కలిపి తింటున్నారా?

అన్నం, గోధుమ రొట్టెలు కలిపి తింటున్నారా?

Author:

ఈరోజుల్లో తినడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి, అవి తినడం వలన ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. అయితే మనం తీసుకునే ప్రతి ఆహరం ద్వారా ఎన్ని పోషక విలువలు మన శరీరంలోకి చెరుతున్నాయన్నది తెలుసుకోవడం కూడా మన డ్యూటీనే. తినే పదార్దాలలో కూడా కొన్ని కలిపి తినకూడదు. సాధారణంగా చాలా మంది  అన్నం, గోధుమ రొట్టెలు రెండూ ఒకే భోజనంలో తింటారు. అలా కలిపి తింటే ఎలాంటి సమస్య తలెత్తుతుందో చూద్దాం. అన్నం తినటం వలన లావుగా అవుతున్నాం అని బాధ పడే వారు కాస్త అన్నం రెండు రొట్టెలు కలిపి తినటం అలవాటు చేసుకుంటారు. కాని అది మంచి పద్దతి కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

don't eat rice and roti together

అన్నం లో కార్బోహైడ్రేట్స్ శాతం ఎక్కువ మరియు గోధుమ రొట్టెలలో కార్బోహైడ్రేట్స్ తో పాటుగా ఫైబర్ , గ్లూటెన్ అనే ప్రోటీన్ కూడా ఉంటాయి. అన్నం తొందరగా జీర్ణం అవుతుంది కానీ రొట్టె అలా కాదు ఎందుకంటే దానిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి. అందుకే రొట్టె నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అలాగే గోధుమ రొట్టెల్లో ఉన్న గ్లూటెన్ ప్రోటీన్ వలన జీర్ణాశయ సమస్య మొదలవుతుంది. గ్లూటెన్ అనగా గ్లూ అంటే జిగురు పదార్థం. ఈ గ్లూటెన్ వల్లనే గోధుమ పిండి నీటితో తడిపినప్పుడు ముద్ద ల తయారు అవుతుంది. ఇలాంటి పదార్థం అరగాలంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి అన్నం, రొట్టె కలిపి తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. కడుపు నొప్పి, అసిడిటీ, గ్యాస్, లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది . అందుకని కాస్త గ్యాప్ తీస్కుని గనక ఈ రెండు పదార్థాలు తిన్నట్టు అయితే ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడినట్టే. సో అన్నం రొట్టె కలిపి తినటం వల్ల వచ్చే సమస్య తెలుసుకున్నారు కదా నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్త పడండి. వాటిని విడి విడిగా తినండి జీర్ణాశయ సమస్యలు తగ్గించుకోండి.

(Visited 1,783 times, 1 visits today)