ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తోన్న ఓ యువతి చాలా లక్కీగా ప్రాణాలు దక్కించుకుంది. చావు అంచుల వరకు వెళ్లిన ఆమె అప్రమత్తంగా ఉన్న కొందరు ప్రయాణికుల వల్ల ప్రాణాలు నిలుపుకోగలిగింది.
;దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చాలా వేగంగా వైరల్ అయింది.రైల్లో కంపార్ట్‌మెంట్ చివర్లో నిల్చొని ఓ యువతి ఇయర్ ఫోన్స్‌ను సరిచేసుకుంటుంది. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా పట్టుకోల్పోయి కిందపడబోయింది. దాంతో పక్కనే ఉన్నతోటి ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆమెను వెంటనే పైకి లాగి ప్రాణాలు కాపాడారు. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసి ఆ ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఫుట్‌బోర్డు మీద ప్రయాణించకండి.. చాలా లక్కీగా తప్పించుకున్నారు’, ‘అతడిని దేవుడే పంపించాడు. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది’, ‘ఓఎమ్‌జీ, అందుకే కోచ్‌లకు క్లోజింగ్ డోర్స్ ఉండాలి’ అని నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
Dont travel on footboard, what a lucky escape. #Mumbailocal #MumbaiTrain
@Central_Railway @Central_Railway @PiyushGoyalOffc @PiyushGoyal @awasthis @raydeep @Shehl @k_navjyot @News18India @preetiraghunand pic.twitter.com/icFAgkKpZB— Vivek Gupta News18 (@imvivekgupta) October 3, 2018