Home / Videos / హర్యానా లో పోలీస్ కానిస్టేబుల్ చేత ఫైన్ కట్టించిన ‘భారతీయుడు’..!

హర్యానా లో పోలీస్ కానిస్టేబుల్ చేత ఫైన్ కట్టించిన ‘భారతీయుడు’..!

ఉత్తి పుణ్యానికి రుబాబు చేయటం కాదు సర్ అప్పుడప్పుడూ వయలేషన్స్ కి జరిమానాలు కూడా కట్టాలి పోలీసు బాబులూ…..మనం పోలీసులం ….ఏం చేసినా చెల్లుతుందనుకుంటే , సుమ్ము సుర్రవటం ఖాయం….హర్యానా లో ఓ చోట జరిగిన సంఘటన తాలూకు వీడియో ఫుటేజ్ చూస్తే ….మీకు విషయం బోధపడి పోతుంది….హెల్మెంట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆ పోలీసు కానిస్టేబుల్ ని ఒక భారతీయుడు ఆపేశాడు. భారతీయుడంటే…అదేనండీ…ఒక సివిలియన్….ఒక సాధారణ పౌరుడు ! రూల్ ఎవరికైనా రూలే నంటూ మోటార్ సైకిల్ తో సహా అతడిని ….పోలీసాఫీసర్ ముందుకు తీసుకెళ్లి, ట్రాఫిక్ చలానా రాయాల్సిందేనంటూ పట్టుబట్టాడు ! విధిలేని పరిస్థితుల్లో ఆ కానిస్టేబుల్ కి పోలీసాఫీసర్ చలానా రాశాడు కూడా…ఈ మొత్తం తతంగాన్నీ ఆ ఔత్సాహిక భారతీయుడు తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు కూడా… తాడిని తన్నే వాడుంటే….వాడి తల తన్నేవాడుంటాడని ఒక సామెత! అంచేత పోలీసు బాబులూ…యూనిఫాం ఉంది కదాని …రెచ్చిపోవద్దు…అప్పుడప్పుడు ఇలాంటి భారతీయుడులు మీ దారికి ఇలాగే అడ్డు తగిలి…మీ ముక్కు పిండుతారు జాగ్రత్త సుమీ..! 

(Visited 1,145 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]