Home / health / రాత్రి ఇంట్లో లైట్ ఆఫ్ చేసాక చీకట్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?

రాత్రి ఇంట్లో లైట్ ఆఫ్ చేసాక చీకట్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?

Author:

స్మార్ట్ ఫోన్ అనేది అందరికి నిత్యావసర వస్తువు అయిపోయింది. యువత స్మార్ట్ ఫోన్ కి బానిస అయిపోతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ యూజర్స్ తమ సమయం ఎక్కువగా ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మరియు వాట్సాప్ మొదలగు సోషల్ మీడియాలో గడుపుతున్నట్లు చాలా సర్వేలు తెలుపుతున్నాయి. లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ వదిలి ఉండలేక పోతున్నారు. ఇంట్లో పేరెంట్స్ పడుకునే సమయంలో లైట్స్ ఆఫ్ చేసినా… దుప్పటి కప్పుకొని చీకట్లో సైతం స్మార్ట్ ఫోన్ గంటల తరబడి వినియోగిస్తున్నారు.

dont-use-smartphone-night-time-after-lights-off

చీకట్లో స్మార్ట్ ఫోన్ వినియోగించటం ద్వారా చాలా మంది తమ కంటి చూపు కోల్పోతున్నారట. సరైన వెలుతురు లేకపోవటంతో.. కంటిలోని రెటినాపై ఎక్కువ భారం పడి దెబ్బతింటుందని ఇంగ్లండ్ పరిశోధకులు తెలిపారు. చీకట్లో 15 నిమిషాల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వైపు చేస్తూ ఉంటే కాసేపటికి కళ్ళు కనిపించకుండా పోతాయట. దుప్పటి కప్పుకొని రాత్రి సమయాల్లో ఫోన్ వాడకం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ మధ్య కాలంలో త్వరగా కంటిచూపు కోల్పోతున్నారట.

(Visited 6,423 times, 1 visits today)