Home / Inspiring Stories / ఫంక్షన్ లలో మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి అందిస్తారు.

ఫంక్షన్ లలో మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి అందిస్తారు.

Author:

Donate Food for Hungers

ఆకలి ప్రతీ మనిషినీ వేదించే సమస్య…. ప్రపంచంలో జరిగే 80% నేరాలకు మొట్టమొదటి కారణం ఆకలే.. రోడ్డుపక్కన కూచున్న మనుషుల్లో,మీ ముందు చెయ్యి చాచే మనుషుల్లో ప్రతీ ఒక్కరు గుప్పెడు మెతుకుల కోసం ఆరాట పడేవారే. అయితే ప్రతీ ఒక్కరి ఆకలి తీర్చాలి అనుకుంటే మాత్రం మీరే కాదు ఎవరి వల్లా కాని పనే కానీ ఒక మార్గం ఉంది కనీసం మీరు తినగా మిగిలిన ఆహారాన్ని వారికందించవచ్చు. దానికి మీరే స్వయంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇదిగో కొంత మంది మనుషులు మీరు వేసే కొన్ని మెతుకులని అవసరమైన వారికోసం అందించటానికి సిద్దంగా ఉన్నారు. వీరు చేసే పనేంటో తెలుసా..? మీ ఇంట్లో పార్టీ కానీ ఫంక్షన్ కానీ జరిగినప్పుడు మిగిలిన ఆహారాన్ని పాడవక ముందే తీసుకు వెళ్ళి ఫుట్ పాత్ మీద ఉండే అభాగ్యులకో లేదంటే అనాద,వృద్ద ఆశ్రమాల్లోనో అందిస్తారు…. ఇప్పటికైతే వీరి సేవలు ప్రధాన నగరాల్లోనే ఉన్నాయి. అయితే వారికి మీరు సమాచారం అందివ్వటం ఎలా అనుకుంటున్నారా…? అందుకే మీకోసం…మరికొంత మంది నిర్భాగ్యుల కోసం ఈ కథనం…

ఫీడింగ్ ఇండియా:

Feeding India Donate Food

హైదరాబాద్ లోనూ ఈ సంస్థ వలంటీర్లున్నారు… ప్రధాన కేంద్రం డిల్లీ అయినా మరో 16 నగరాల్లోనూ ఈ సంస్థ వలంటీర్లు పని చేస్తున్నారు. డబ్బులకోసం కాకుండా కేవలం ఆత్మ సంతృప్తి కోసం పనిచేసే వాళ్ళం మేము అని గర్వంగా చెప్పుకునే ఫీడింగ్ ఇండియా వలంటీర్లు బెంగుళూరు,భువనేశ్వర్, చెన్నై,హైదరాబాద్,ఫరీదైబైద్, గోవా, నోయిడా, గుర్గావ్, ఇండోర్,జైపూర్, కోల్కతా,ముంబాయి, నాగ్పూర్, పూనె, సోలాన్ వంటి నగరాల్లో 24 గంటలూ మీరు కాల్ చేయగానే వచ్చి మీరిచ్చే ఆహారాన్ని తీసుకు వెళ్ళే పనిలో ఉన్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే ఫీడింగ్ ఇండియా అనే యాప్ ద్వారా కానీ లేదంటే 098711 78810 అనే నంబర్ లో కానీ వీరిని సంప్రదించవచ్చు…

రాబిన్ హూడ్ ఆర్మీ:

Donate Food

ఈ స్వచ్చంద సంస్థ పూర్థి స్తాయి వాలంటీర్ బేస్ విధానం లోనే ఉంది కావలంటే మీరూ స్వచ్చందంగా ఈ సంస్థ ద్వారా పని చేయవచ్చు. వీరు ఇప్పటికి నగరాల్లో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లలో మిగిలి పోయిన ఆహారాన్ని సేకరించి కొన్ని వందల మందికి చేర వేసే పని లో ఉన్నారు. మీరు మీ ఖాళీ టైం లో బైక్ మీద వెళ్ళి ఇవ్వటానికి సిద్దం అయితే చాలు మీ ద్వారా కొందరికి అన్నం అందిస్తారు. వీరితో చేరాలి అనుకుంటే Robinhoodarmy.com ఈ లింక్ ఫాలో అయిపోండి ఫేస్బుక్ ద్వారా కూడా సంప్రదించ వచ్చు. పాకిస్తాన్ లోనూ తమ సేవలను మొదలు పెట్టిన రాబిన్ హుడ్ ఆర్మీ ఇంకొన్ని చిన్న దేశాల్లోనూ తమ సేవలను విస్తరించాలనే ఆలోచనలో ఉంది…

గ్లో టైడ్:

Donate Food

నేను భారత దేశాన్ని ప్రపంచంలోనే ధనవంతమైన దేశంగా చూడదటం కన్నా,ఆనందకరమైన ప్రజలుండే దేశంగా చూదాలనుకుంటున్నా… 1992 లొ భారతరత్న అందుకున్న సమయంలో జేఆర్డీ టాటా అన్న మాటలే మాకు ఆదర్శం అనే ఈ టీం. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ కేంద్రంగా పని చేస్తున్నరు. హొటల్స్,రెస్టారెంట్ల నుండీ కొన్ని సార్లు ఫంక్షన్ తరవాత మిగిలిన ఆహారాన్ని. (శుభ్రత విషయంలో రాజీ పడరు. అన్నం ఏమాత్రం పాడైనట్టున్న దాన్ని పిల్లలకు ఇవ్వటానికి తీసుకోరు) సేకరిస్తూ. మురికి వాడల్లోనూ,రైల్వేస్టేషన్లూ,ఫుట్ పాత్ ల మీద ఉండే పేదలకూ,ఎక్కువగా స్లమ్ ఏరియాల్లో ఉండే స్కూళ్ళలోనూ ఉండే పిల్లలకు అందిస్తున్నారు…. +91-7702209484, 8121216677 అనే నంబర్లలో గానీ, Glowtide.org వెబ్ సైట్ ద్వారా అయిన గానీ, 8-3-168/B/30/A, LaxmiNagar, SR Nagar, Hyderabad ఈ అడ్రస్ లో గానీ,లేదంటే [email protected] ఈ మెయిల్ అడ్రస్ ద్వారా గానీ మీరు వీరిని కాంటాక్ట్ చేయవచ్చు..

రోటీ బ్యాంక్ బై డబ్బావాలాస్ :

Donate Food

ముంబై కేంద్రంగా నడిచే ఈ సంఘం మీ ఇంట్లో పార్టీ లేదా ఫంక్షన్ తరవాత మిగిలి పోయిన ఆహారాన్నే కాదు,ఒక్క కాల్ చేస్తే వచ్చి మీ ఇంట్లో మామూలుగా మిగిలే కొద్ది పాటి అన్నం,కూరలను కూడా తీసుకు వెల్తారు. అప్పటికప్పుడు వీలుంటే కొంచం వేడి చేసి కావాల్సిన వారికి ప్రేమగా అందిస్తారు… కనీసం మీరు ఆఫీస్ లో ఉండి ఆరోజు లంచ్ బాక్స్ తినే వీలు లేకపోతే కాల్ చేసినా చాలు వచ్చి ఆ లంచ్ బాక్స్ ని రోడ్డు మీదో,రైల్వే స్టేషన్ ముందో ఉన్న వారికి కి అందిస్తారు మీరు కాల్ చేయాల్సిన నంబర్ లు 91-9867-221-310 ఒర్ +91-8652-760-542

ఆర్.బీ.శివకుమార్:

Donate Food

బెంగుళూరు లో ఉండే ఈయన ఒక రోజు మిగిలిపోయిన ఆహారం అంటూ ఒక హొటల్ వాళ్ళు ట్రాలీల్లో తీసుకు వెళ్ళి మరీ  పడేసి వస్తూంటే భరించలేకపోయాడట. అయితే ఆ కోపాన్ని పనిలో చూపించటం మొదలు పెట్టాడు తనే స్వయంగా వచ్చి మీ పార్టీ,ఫంక్షన్ లలో మిగిలిన ఆహారాన్ని తీసుకుంటాడు. అయితే కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటాడు. ఇళ్ళకీ వస్తాడు కానీ మరీ తక్కువ ఉంటే రాడు. తీసుకునే ముందు తాను తిని చూసి అది బావుంది అని నిర్థారించుకున్నాకే దాన్ని పంచటానికి తీసుకు వెళతాడు. 09900568514 ఈ నంబర్ లో మీరు శివకుమార్ తో మాట్లాడవచ్చు…

అన్నక్షేత్ర:

Donate Food

జైపూర్ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ వ్యాన్ లలో వచ్చి రెస్టారెంట్లూ,ఫంక్షన్ హాళ్ళూ,క్యాటరింగ్ కంపెనీలవద్దనుంచి మిగిలిన ఆన్నాన్ని సేకరిస్తుంది. కేవలం రాత్రి పూట మాత్రమే వచ్చి మిగిలిన ఆహారాన్ని తీసుకు వెళ్ళి ఫ్రిజ్ లో ఆ అన్నాన్ని ఉంచుతారు. పొద్దున్నే పంచటానికి తీసుకు వెళ్ళేముందువారి దగ్గర ఉండే డాక్టర్లు అది ప్రమాదకరం కాదు అని సర్టిఫై చేసిన తర్వాతే ఆ ఆహారం బయటకు వెళ్తుంది. ఎక్కువగా మురికి వాడలూ,పేదలు అధికంగా ఉండే ప్రాంతాలూ,కూలీ పనులు జరుగుతున్న కేంద్రాలలో ఉన్న వారికి ఈ ఆహారాన్ని అందిస్తారు వీళ్ళు,15 నగరాలలో వీరు తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. +91-9001295293, 0141-3221267 ఈ నంబర్లలో వీరిని సంప్రదించవచ్చు..

వ్రాప్ ఇట్, డోంట్ వేస్ట్ యౌవర్ ఫూడ్:

dONATE fOOD

తమిళ నాడు లోని కోయం బత్తూరూ,చెన్నై కేంద్రాలుగా నడిచే ఈ సంస్థ ఒక NGO కూడా. 50 మంది వాలంటీర్ లు మీరు కాల్ చేయగానే వచ్చి అన్నాన్ని సేకరించే పని లో బిజీ గా ఉంటారు. అయితే సాయంత్రం 4గంటల నుండీ రాత్రి 10 గంటల వరకూ మాత్రమే వీరు ఆహార సేకరణలో ఉంటారు. అంతే కాదు వీరు ముందు తిని అది బావుందీ అంటేనే మిగిలిన వారికి అందిస్తారు. 099520 63561, 099405 58802, 099403 18578, 096001 33657 ఈ నమబర్లలో మీరు వీరిని సంప్రదించవచ్చు. అయితే మీరు చెన్నై లేదా కోయం బత్తురు లో ఉండాలి వేరే చోట అయితే వీరు రాలేరు.

మీకు చాన్స్ ఉండక పోవచ్చు…పైన చెప్పిన నగరాల్లో మీరు ఉంటూ ఉండక పోవచ్చు… కానీ…! మీకు తెలిసిన వాళ్ళుంటారు కదా..! ఈ పోస్ట్ ని వారికి అందించండి వారి వల్ల లేదంటే వారికి తెలిసిన వారి వల్ల కొందరి ఆకలి తీరుతుంది. ఒక మనిషి ఒక్క రాత్రైనా ఆకలి తో కాక ఆనందంతో నిద్ర పోతాడు. ఒక చిన్న పిల్లవాడు పుస్తకాల సంచీ మోస్తూ బడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తలుచుకుంటాడు…..

(Visited 611 times, 1 visits today)