Home / health / టాబ్లెట్ నీటితోనే వేసుకోవాలి.. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు!!!

టాబ్లెట్ నీటితోనే వేసుకోవాలి.. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు!!!

Author:

తల నొప్పి, కడుపు నొప్పి లేక అసిడిటీ తో బాధ పడుతున్నారా? ఒక టాబ్లెట్ వేస్కొని ఉపశమనం పొందుదాం అనుకుంటున్నారా? అయితే ఆ వేసుకునే టాబ్లెట్ తో పాటు ఎక్కువ నీరు త్రాగండి. చాలా మంది టాబ్లెట్స్ ని జస్ట్ బఠాని, పల్లినో తిన్నట్టు నోట్లో వేస్కుని మింగేస్తారు, అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదట. టాబ్లెట్ ని ఎల్లప్పుడూ నీటితోనే వేస్కోవాలి. ఆ నీరు కూడా మరీ వేడి, చల్లవి కాకుండా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటితోనే వేస్కోవాలి. అప్పుడే టాబ్లెట్ వేసుకున్న ఫలితం దక్కుతుంది.

get tablets

టాబ్లెట్ వేసుకొనేటప్పుడు వాటర్ తాగకపోవటం వలన ఆ టాబ్లెట్ సరిగా పని చేయకపోవచ్చు. అలాగే ఆ టాబ్లెట్ గొంతుకి అతుక్కుని మింగేటప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక్కోసారి గొంతులోనే టాబ్లెట్ కరిగిపోవడం వల్ల అసలు సమస్య తగ్గకుండా కొత్త సమస్యను క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఒక్కోసారి గొంతులో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది. అదే నీటి తో వేస్య్కుంటే ఆ టాబ్లెట్ డైరెక్ట్ గా జీర్ణాశయం లోకి వెళ్లి అక్కడే కరిగి సమస్యని తగ్గుముఖం పట్టిస్తుంది. ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకునేవారు వాటిని అమాంతం మింగేసి, వాటర్ అసలు తాగకుండా హమ్మయ్య ఇవాల్టికి టాబ్లెట్ వేసేస్కున్నం ఓ పని అయిపయింది అనుకుంటుంటారు. ఇక అది మానేయండి, టాబ్లెట్ వేస్కునే ముందు కొన్ని వాటర్ తాగి టాబ్లెట్ వేస్కుని మిగతా వాటర్ తాగేయ్యాలి. చల్ల నీటితో గానీ వేడి నీటితో గానీ టాబ్లెట్ ఎప్పుడు వేస్కోకూడదు. రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీటితో మాత్రమే టాబ్లెట్ ని వేస్కోవాలి. ఇక ముందు ఈ పద్ధతి పాటించి త్వరగా ఉపశమనం పొందండి.

(Visited 494 times, 1 visits today)