Home / health / పాలల్లో చక్కెర బదులు బెల్లంని కలుపుకొని తాగితే అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.

పాలల్లో చక్కెర బదులు బెల్లంని కలుపుకొని తాగితే అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Author:

ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ప్రతి రోజు పాలు తాగుతుంటారు. వట్టి పాలు తాగలేము కదా అందుకే అందుకో కొద్దిగా చక్కర కలుపుకొని తాగుతారు. ఒకవేళ చక్కర వేయకపోతే  పాలు రుచిగా ఉండవు. కొందరు షుగర్ ఉన్నవారు మాత్రం కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగుతారు. ఒక్కప్పుడు పల్లెల్లో ఎక్కువగా పాలు, టీ, కాఫీలలో బెల్లాన్ని ఎక్కువగా వాడేవారు. మీరు చక్కరకు బదులు బెల్లం కలుపుకొని తాగటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు డాక్టర్స్. మరి పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.

drinking-milk-with-jaggery-will-give-more-health

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన జీర్ణ క్రియ చాలా మెరుగుపడుతుంది. బెల్లం వలన పేగు సంబంధిత సమస్యలు కూడా నయం అవుతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుదల: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అలాగే బెల్లం కూడా చాలా మంచింది. పాలు, బెల్లం మిశ్రమం ఒక అద్భుతమైన ఔషధంగా మనకు పని చేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే పోషాకాల వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మానవ శరీరంలోని అనారోగ్యాన్ని తగ్గిస్తుంది.

జాయింట్ పెయిన్స్: పాలు తాగడం వలన ఎముకలు దృడంగా అవుతాయి. కానీ బెల్లం కలుపుకొని తాగడం వలన ఎముకలు  దృడంగా అవడమే కాకుండా మొకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి: పాలు, బెల్లం మిశ్రమం వలన బాడీలో ఉండే కొవ్వును బెల్లం కరిగించేస్తుంది. అందువలన మనం ఎక్కువ కష్టపడకుండానే బరువు తగ్గొచ్చు. ఎందుకంటే బెల్లంలో పొటాషియం, పాలల్లో క్యాల్షియం ఉండటం వలన మనకు తెలియకుండానే బరువు తగ్గి చాలా స్లిమ్ గా తయారు అవుతారు.

చర్మానికి, జుట్టుకి : ఈ మిశ్రమం వలన చర్మం చాలా కాంతివంతగా అవుతుంది. అలాగే జుట్టు సిల్కిగా మారుతుంది.

రుతుక్రమంలో కడుపు నొప్పి: రుతుక్రమంలో కడుపు నొప్పితో బాధపడేవారు పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన కడుపులో బెల్లం వలన నొప్పి తక్కువై కడుపులో చల్లగా ఉంటుంది.

రక్తహీనత: మహిళలలో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది దానిని అరికట్టడానికి ఐరన్ టాబ్లెట్స్ వాడుతుమతారు. బెల్లంలో రక్త హీనతను అరికట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. దానితో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు

(Visited 5,259 times, 1 visits today)