Home / General / కారెక్కి షికారు చేసిన పాము

కారెక్కి షికారు చేసిన పాము

Author:

రోడ్డు మీద మంచి పసందైన కారు కనపడినా… లేటెస్టు మోడల్ కారు కనబడ్డ ఒకసారి డ్రైవ్ చేయాలనిపించడం ఎవరికైనా అరుదు. కానీ, అమెరికాలోని జార్జియాలోని ఒక పాముకి కూడా కారు చూడగానే ఎంతకాలం ఇలా పాములా పాకుతూ వెళ్దాం.. ఒకసారి కారెక్కి షికారు చేద్దాం అనిపిచ్చినట్టుంది. అంతే రోడ్డు మీద కనపడ్డ ఆ  కారు బానెట్ పైకి సరసరా పాకేసింది. తన కారు పైన పాము పాకడం గమనించిన కారు యజమాని వెంటనే తన ఫోను తీసి తనతో పాటూ ప్రయాణం చేస్తున్న పాముని డ్రైవ్‌ చేస్తూనే వీడియో తీయడంమొదలెట్టాడు. అంతలోనే ఆ పాము కారు బానెట్‌పై నుంచి కిటికీ లోపలికి వచ్చేందుకు తెగ ప్రయత్నించింది. ఎంచక్కా డ్రైవింగ్ సీటు పక్కనే కూర్చుందాం అనుకుంది కాబోలు. కానీ, పాము లోపలికొస్తే ప్రమాదమని భయపడిన యజమాని కారుని హైవే మీదే ఒక పక్కన ఆపేశాడు. దాంతో పాము కారు దిగి వెళ్లిపోయింది. ఈయన పోస్టు చేసిన తన కారుపై పాము షికారు వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మీరు చూద్దాం అనుకుంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

(Visited 1,642 times, 1 visits today)