Home / health / ఎండుద్రాక్షలని రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే తింటే చాలా రోగాలకు దూరంగా ఉండవచ్చు.

ఎండుద్రాక్షలని రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే తింటే చాలా రోగాలకు దూరంగా ఉండవచ్చు.

Author:

మనకి చూడటానికి ఎండు ద్రాక్ష సన్నగా ఉన్న దానిని మనం తింటే మాత్రం మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో పొటాషియం,విటమిన్ బి, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.ఇందులో కార్బోహైడ్రేట్స్ మనకు కావలసిన మోతాదులో ఉంటాయి. దీనితో మనకు రోజంతటికి  కావలసిన ఎనర్జీని అందిస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఎండు ద్రాక్ష వలన మరి ఒక సారి చూద్దాం….

Dry-Grapes-Will-Give-Good-Health

  • ఎండు ద్రాక్షని గ్లాస్ పాలల్లో కొద్దిగా ఉడికించి రాత్రి పడుకోబోయే ముందు తాగితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్షలో ఐరన్ అధికంగా లభిస్తుంది.అనీమియా తో భాధపడేవారు నానపెట్టిన ఎండు ద్రాక్షను తీసుకోవడం చాలా మంచింది ఎందుకంటే ఇది అనీమియా నివారణలో సహాయపడుతుంది.అలాగే చాలా రకాలైన ఇతర  వ్యాధులను కూడా నివారిస్తుంది.
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ లలో  ఎండు ద్రాక్షలను కలిపి తీసుకుంటే చాలా మంచిది.దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.
  • బిపి, బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నవారు ఎండు ద్రాక్షలో వెల్లుల్లి ని తీసుకోవడం ద్వారా వాటిని కంట్రోల్ చేయవచ్చు.
  • ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ దానివలన జ్వరం వంటి ఇతర వ్యాధులు వచ్చినప్పుడు కంట్రోల్ చేస్తుంది.
(Visited 3,806 times, 1 visits today)