Home / Entertainment / బాలయ్య వందవ సినిమా నుండి దేవి శ్రీ అవుట్.

బాలయ్య వందవ సినిమా నుండి దేవి శ్రీ అవుట్.

Author:

బాలయ్య వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం బాలయ్య, అలాగే డైరెక్టర్ క్రిష్. ఈ సినిమా కోసం క్రిష్ మొదటి సారి హాలీవుడ్ నిపుణులతో పని చేస్తున్నాడు. బాలయ్య చాలా కథలు విన్న తర్వాత ఈ క్రిష్ సినిమా ఒప్పుకోవడం వెనుక కథనే  కారణం. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదటి షెడ్యూల్  జార్జియాలో పూర్తీ చేసుకొని వచ్చింది.

gautamiputra satakarni movie

ఇక ఈ మధ్య క్రిష్ పెళ్లి అవడంతో కొద్దిగా ఆలస్యం అవుతుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు కానీ ఈ సినిమా మొత్తం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూట్ జరుగుతున్నట్టు నిర్మాతలు తెలుపుతున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే సాంకేతిక వర్గం ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఒక మార్పు జరుగుతుంది. బాలయ్య వందవ సినిమా అనగానే చాలా మంది సాంకేతిక వర్గం వారు నాకు ఛాన్స్ రావాలి అని కోరుకున్నారు కానీ కొంతమందికే ఆ ఛాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు దేవి శ్రీ తప్పుకున్నాడు. దానికి కారణం ఈ సినిమాను ఎట్టి పరిస్థితులలో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని క్రిష్ భావిస్తున్నాడు. దానితో ఆ సమయంలో ఇది వరకే ఒప్పుకున్నా సినిమాలు చాలా ఉండటంతో పని వత్తిడి అవుతుందని దేవి శ్రీ  ముందే తప్పుకుంటున్నట్టు తెలిసింది.

(Visited 102 times, 1 visits today)