Home / Entertainment / ద్వారక టీజర్ రిలీజ్.

ద్వారక టీజర్ రిలీజ్.

Author:

తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్, డూపర్ హిట్స్ అందించిన నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఈ సంస్థ సమర్పణలో లెజెండ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ద్వారక’. పెళ్లి చూపులు లాంటి సినిమాతో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరో. విజయ్ సరసన పూజ జవేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రవీంద్ర(MSR) దర్శకత్వం వహిస్తున్నాడు.

Dwaraka Movie Teaser

కృష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమా సమర్పకుడు ఆర్.బి. చౌదరి “ద్వారక” సినిమా పోస్టర్ ని అలాగే ఈ సినిమాలో సాంగ్ (భజరే నంద గోపాల..) టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ ….. ఈ సినిమా  సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుండి వస్తున్నా 89 వ సినిమా కావడం విశేషం.మా సంస్థ నుండి ఎందరో టెక్నీషన్స్ వచ్చారు ఇప్పుడు శ్రీనివాస్ ని కూడా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

ఈ సినిమా నిర్మాతలు ప్రద్యుమ్న- గణేష్ మాట్లాడుతూ…. ఆర్.బి. చౌదరి గారి ఆశీస్సులతో మా మొదటి సినిమా రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి పూర్తిచేస్తాం. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ ను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

(Visited 334 times, 1 visits today)