Home / Inspiring Stories / గద్ద జీవించి, మనల్ని కూడా అలా జీవించమని జీవిత సత్యాన్ని బోధిస్తుందని మీకు తెలుసా?

గద్ద జీవించి, మనల్ని కూడా అలా జీవించమని జీవిత సత్యాన్ని బోధిస్తుందని మీకు తెలుసా?

Author:

గద్ద అనగానే మనకు ఎప్పుడు కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను బయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు. ఇంకా గద్దలు మనుషుల కలేభారాలని పీక్కు తింటాయని కథనాలు వింటుంటాం.కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంత మందికి తెలుసు?

eagle inspiring story

గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి  దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక సుష్కించి మరణించడం లేదా భాదకరమైన సరే తనను తాను మార్చుకోవడం.

ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా… ఎంత క్షీణ దశకు వచ్చినా బ్రతకాలనే అనుకుంటుంది. అలాగే, గద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది. మరి గద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుంది ఒక్కసారి చూద్దాం….

old_Eagle story

గద్దకు ఈ  మార్పు చాలా భాదాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఒక ఎతైనా కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడ పెరిగిపోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో భాధ కలిగిన నెమ్మదిగా వొలిచేసుకుంటుంది. ఇలా  వదిలించుకున్న ముక్కు మళ్ళీ కాస్తా కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది. అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది. ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది. ఇలా 5నెలలు భాదాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది.

ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని, గద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది.

(Visited 5,625 times, 1 visits today)