Home / Political / సిగరెట్ మానాలనుకుంటున్నారా?

సిగరెట్ మానాలనుకుంటున్నారా?

Author:

Easiest-Way-to-Stop-Smoking

సిగరెట్’లో వేలకొద్ది విషాలు, విషపూరిత లోహాలు మరియు కార్సినోజేన్’లు ఉంటాయి. ప్రమాదకర అలవాటు మానటానికి కొద్ది సమయం కేటాయించండి. స్వతహాగా మానేయటం కుదరకపోతే, చుట్టూ ఉండే వారి సహాయం తీసుకోండి. పొగ తాగాలని కోరికలను పెంచే పరిణామాలకు దూరంగా ఉండండి. ఏ కోణంలోను పొగత్రాగటం శరీరానికి హానికరం, ఈ విషయంలో రెండు విషయాలను గమనించండి. సిగరెట్ తాగుతున్నారు అంటే కొద్ది కొద్దిగా మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు, పీల్చే ప్రతి పఫ్ వలన చాలా రకాల వ్యాధులను శరీరంలోకి ఇముడ్చుకుంటున్నారు అని అర్థం. మీరు త్రాగే సిగరెట్’లో అధిక మొత్తంలో బెంజీన్, పెస్టిసైడ్స్ మరియు గ్యాసోలిన్ వంటి ప్రమాదకర కారకాలన్ని ఉన్నాయి. అంతేకాకుండా శవాలను నిల్వ చేయటానికి వాడే ‘ఫార్మాల్డిహైడ్’ మీరు త్రాగే సిగరెట్’లలో ఉంటుంది. వీటితో పాటూ, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి లోహ మూలకాలన్ని ఉంటాయి. ఇవన్ని తెలిసి కూడా మీరు సిగరెట్ ఎందుకు త్రాగుతున్నారు? అంటే మీరు పూర్తిగా మీ చేతిలో వెలిగే రెండంగుళాల చీన్న వస్తువుకి బానిసలయ్యారన్న మాట… ఒక వేళ మీరు సిగరెట్ మానేయాలనుకుంటే ఇది చదవండి…

1.చాలా మంది సిగరెట్ తాగటానికి అనువైన సమయంగా రాత్రి అని చెపుతుంటారు. ఈ సమయంలో సిగరెట్ ఎక్కువగా తాగుతుంటారు కారణం అలవాటు అని చెప్పవచ్చు. సిగరెట్ మానాలి అనుకునే వారిలో 95 శాతం మంది మానేయాలి అనుకుంటూ ఉంటారు కానీ మానటానికి ఇబ్బంది పడుతుంటారు కారణం అలవాటు. మీ మెదడు మత్తుమందుగా పిలవబడే నికోటిన్’కు అలవాటు పడింది. అంతేకాకుండా రాత్రి సమయంలో ఎక్కువగా తాగటం వలన ప్రతి రోజు సిగరెట్ తాగటానికి ప్రయత్నిస్తారు. ఆకస్మాత్తుగా మీరు సిగరెట్ మానటానికి కష్టమని చెప్పవచ్చు. నెమ్మదిగా తగ్గించటం వలన ఈ అలవాటు మానవచ్చు.

2. సిగరెట్’కు బదులుగా గమ్స్’లను వాడండి
మీ సిగరెట్ అలవాటును మానుకోటానికి సిగరెట్’కు బదులుగా ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లను వృద్ధి చేసుకోండి. ఎల్లప్పుడూ మీతో చూయింగ్ గమ్స్, చాక్లెట్’లను తీసుకెళ్ళండి. సిగరెట్ మానేసిన కొన్ని రోజుల వరకు సిగరెట్ పైన ఉన్న కోరిక లేదా వ్యామోహాన్ని నియంత్రణలో ఉంచుకోటానికి ఇవి సహాయపడతాయి. ఈ సమయంలో మీరు వేసే అడుగు పైన మాత్రమె సిగరెట్ మానేయటం ఆధారపడి ఉంటుంది.

3. సిగరెట్’లను తుంచి వేయండి
సిగరెట్ మరియు వాటికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను తుంచి భయటపడేయండి. అగ్గిపెట్టె, ఆష్ట్రే, లైటర్, రోలింగ్ పేపర్, హుక్క బాటిల్స్ వంటి సిగరెట్’కు సంబంధించిన అన్ని రకాల వస్తువులను భయట విసిరేయండి. ఫలితంగా మీ దృష్టి సిగరెట్ వైపు వెళ్ళకుండా ఉంటుంది. మానసికంగా స్థిరత్వాన్ని కలిగి ఉండటం చాలా అవసరం.

4.దృష్టి మరల్చుకోండి:
సిగరెట్ మానటంలో లక్ష్య నిర్దారణ చాలా ముఖ్యం కారణం సిగరెట్ అలవాటును వారం రోజుల్లో మానటం చాలా కష్టం. ముఖ్యంగా సిగరెట్’కు భానిస అయిన వారిలో మాన్పించటం చాలా కష్టం. సిగరెట్ మానాలి అనే ప్రక్రియను ఒక ప్రణాలిక పరంగా అనుసరించండి.రోజుకి వీలైనంత గా సిగరెట్ అనేది ఎంత ప్రమాదకరమో గుర్తు చేసుకుంటూ ఉండండి.లేదా ఒక పదినిమిషాల పాటు చల్లని నీళ్ళని కొద్దికొద్దిగా తాగుతూండండి.

5. సిగరెట్ తాగను అని అంతర్గతంగా చెప్పండి
మీరు పొగతాగటం మానేసిన తరువాత, ప్రతి రోజు మీలో మీరుగా నేను సిగరెట్తా గను అని సమాధానంగా చెప్పుకోండి. మానసికంగా పాజిటివ్’గా మరియు పొగ నిర్దేశిత ప్రాంతాలలో తిరగటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వలన మానసిక ద్రుడత్వాన్ని పొందినవారు అవుతారు.

6. మీ మనసులో మానేయాలనేబలమైన కోరిక ఉండాలి
కొంత మంది పొగతాగిన తరువాత సిగరెట్ పైన ఉన్న వ్యామోహం లేదా నికోటిన్ పైన ఉన్న కోరికతో తిరిగి సిగరెట్ తాగటాన్ని ప్రారంభిస్తారు. సిగరెట్ తాగటం మానేసిన తరువాత 3 నెలల వరకు మానేసిన సిగరెట్ వైపు తిరిగి మొగ్గు చూపే అవకాశం ఉంది అని పరిశోధనలలో వెల్లడయింది. కావున, మొదటి మూడు నెలల పాటూ సిగరెట్ పై ఉన్న వ్యామోహాన్ని నియంత్రించ గలిగితే, దాదాపు లక్ష్యాన్ని చేదించినట్లే.

7. మీ స్నేహితులకు తెలపండి
కొంత మంది ఆల్కహాల్ తాగే సమయంలో తప్పక సిగరెట్ తాగుతారు, అందులో మీరు ఒకరిగా ఉన్నట్లయితే, ప్రణాళికల గురించి వారికి తెలపండి. సిగరెట్ మానేసినందు వలన విరామ సమయంలో మీతో సమయం కేటాయించలేను అని సహా ఉద్యోగులకు నచ్చచెప్పండి. వారిని భాద పెట్టకుండా ఈ విషయాన్ని తెలపండి.
ఇవన్నీ చెప్పటం సులభమే కానీ ఆచరణ చాలా కష్టమైంది… కానీ మీరు సిగరెట్ మానేసాక మీమీద మీకు కలిగే ఆత్మ విశ్వాసానికి వెలకట్టే వారుండరు…

(Visited 212 times, 1 visits today)