Home / Latest Alajadi / మొబైల్ లో బాలన్స్, ఇంటర్నెట్ లోను తీసుకోవటం చాల సింపుల్… అన్ని రకాల వినియోగదారుల ఇలా వెంటనే లోను తీసుకోండి.

మొబైల్ లో బాలన్స్, ఇంటర్నెట్ లోను తీసుకోవటం చాల సింపుల్… అన్ని రకాల వినియోగదారుల ఇలా వెంటనే లోను తీసుకోండి.

Author:

అత్యవసర ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతే ఎంత చిరాకేస్తుందో, ఇక ఆ సమయంలో రీఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో లేకపోతే కోపం నషాళానికి తాకుతుంది. వినియోగదారుల సౌకర్యం కోసం ఇలా అత్యవసర సమయాల్లో అసహనానికి లోను కాకుండా లోను అందిస్తున్నాయి టెలికామ్ సంస్థలు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ, ఎలా లోను తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకే మేము అన్ని రకాల సిమ్ కార్డులు ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆయా నెట్ వర్క్ నుండి ఎలా లోను పొందాలో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

get loan from all mobile operators

ఎయిర్‌టెల్:
మీ ఫోన్ బ్యాలన్స్ 5 రూపాయల కన్నా తక్కువుంటే మీరు లోన్ పొందొచ్చు. ఇందుకోసం మీరు మీ మొబైల్ నుంచి *141*10#కు గాని లేదా 52141 కాల్ చేయాలి. మీరు వెంటనే రూ. 10 టాక్ టైం పొందుతారు.
ఎయిర్ టెల్ డేటా లోన్ కోడ్:
డేటా లోన్ కావాలంటే *141*567# కు కాల్ చేసి పొందవచ్చు. ఇది మీకు రెండు రోజుల వ్యాలిడితీ 50 ఎంబీ వరకు వస్తుంది. మీ తరువాత రీఛార్జ్ లో రూ. 15 ఎయిర్ టెల్ తీసుకుంటుంది.
వొడాఫోన్:
మీరు 1241కి కాల్ చేసి పొందవచ్చు. ‘SMS CREDIT’ to 144కి ఎసెమ్మెస్ చేయడం ద్వారా పొందొచ్చు. దీంతో పాటు *111*10# నంబర్ కి కాల్ చేసి 10 రూపాయలు పొందవచ్చు. తర్వాత రీఛార్జి చేపిస్తే మీ నుంచి తరువాత రూ. 13 తీసుకుంటారు.
వొడాఫోన్ డేటా లోన్ కోడ్:
*111*10# నంబర్ కి కాల్ చేయడం ద్వారా 30 MB of 3G 1 రోజు వ్యాలిడితో వస్తుంది. ఆ తరువాత 10రూపాయలు మీ బ్యాలెన్స్ నుండి తీసుకుంటారు.
బిఎస్ఎన్ఎల్:
బిఎస్ఎన్ఎల్ కష్టమర్లు SMS CREDIT’ to 53738 ద్వారా రూ. 10 టాక్ టైం పొందవచ్చు. మీరు 24 గంటల్లోగా రీఛార్జి చేయకుంటే ఆ తరువాత మీ నుంచి 11రూపాయలు కట్ చేస్తారు.

టెలినార్:
టెలినార్ వినియోగదారులు *141# డయల్ చేసి, స్కీఎం పై చూపించిన ఆప్షన్స్ లో 5 రూపాయల లోన్ ని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా లోను పొందవచ్చు. తదుపరి రీచార్జ్ నుండి మీ అకౌంట్ నుండి 6 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
రిలయన్స్:
రిలయన్స్ కష్టమర్లు *141*5# డయల్ చేయడం ద్వారా 10 రూపాయలు టాక్ టైం లోన్ పొందుతారు. *141*10# ఈ నంబర్ కి కాల్ చేసినా మీకు ఆఫర్ వస్తుంది. YCR’ అని టైప్ చేసి 51234 మెసేజ్ చేసినా మీరు పొందవచ్చు.
ఐడియా:
ఐడియా కష్టమర్లు *150*06#కి డయల్ చేయడం ద్వారా 25 ఎంబీ డేటాను రెండు రోజుల పాటు పొందవచ్చు. దీనికోసం ఐడియా మీ నుంచి ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తుంది. *150*333# ఈ నంబర్ కి డయల్ చేయడం ద్వారా 35 MB 3G డేటా మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. దీనికి తరువాత 11 రూపాయలు ఛార్జ్ చేస్తారు.

(Visited 450 times, 1 visits today)