Home / Latest Alajadi / ఈ చిట్కాతో బట్టలపై పడిన ఇంక్, టీ లాంటి మరకలని చాలా సులభంగా తొలగించుకోవచ్చు.

ఈ చిట్కాతో బట్టలపై పడిన ఇంక్, టీ లాంటి మరకలని చాలా సులభంగా తొలగించుకోవచ్చు.

Author:

మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే బట్టలపై ఒక్కొక్కసారి అనుకోకుండా పడే మరకలు మనని ఎంతో  బాధపెడతాయి. వాటిని చూసి బాధపడటం మానేసి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో సులువుగా మరకను పోగొట్టి మళ్ళీ మన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇంట్లో స్కూలుకెళ్ళే పిల్లలుంటే ఇది సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఎన్ని సార్లు ఉతికినా ఆ గీతలు చెరిగిపోవు. ఇక మనం మాములుగా ఎప్పటిలాగే పెన్ను జేబులో పెట్టుకున్నప్పటికీ ఒక్కోసారి పెన్ను ఇంకు కక్కి వేసుకున్న దుస్తులకు అంటడం జరుగుతుంది. అలాగే, మన దుస్తులకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల పసుపు రంగులో కూర మరకలు, టీ మరకలు పడుతుంటాయి. ఈ మరకలను తొలగించుకోవటం చాలా సులభం. క్రింది చిట్కాల ద్వారా మరకల్ని వెంటనే తొలగించుకోవచ్చు.

How-To-Remove-Ink-Strains-On-Shirt

  • కాటన్ దుస్తుల మీద పడ్డ పసుపు రంగు కూర మరకలను తొలగించడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. మెండి మరకల మీద నిమ్మరసాన్ని పిండి, ఒక చుక్క వెనిగర్ వేసి బాగా రుద్ది వాష్ చేస్తే శుభ్రంగా తొలగిపోతుంది. ఈ రెండింటి( నిమ్మ- వెనిగర్) కలయిక ఒక నాణ్యమైన నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తాయి.
  • దుస్తుల మీద పడ్డ ఇంకు మరకలను తొలగించడానికి నిమ్మరసం అద్భుతంగా సహాయపడుతుంది. ఇంక్ మరకలు పడిన వెంటనే తడి ఆరిపోక ముందే, నిమ్మ రసాన్ని పిండి, చేతులతో రుద్ది కడగాలి. తర్వాత సర్ఫ్ లో నానబెట్టి, మంచినీటితో శుభ్రం చేయడం వల్ల మరకలు మటుమాయం అవుతాయి.
  • దుస్తుల మీద టీ మరకలు పడిన వెంటనే తొలగించాలంటే టూత్ పేస్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టీ మరకలు పడిన చోట కొద్దిగా టూత్ పేస్ట్ తో రుద్ది తర్వాత చల్లటి నీటితో కడిగి శుభ్రం చేయాలి.
(Visited 1,587 times, 1 visits today)