Home / health / నల్లగా మారిన చర్మరంగును తిరిగి తెల్లగా మార్చడానికి సులభమైన చిట్కాలు.

నల్లగా మారిన చర్మరంగును తిరిగి తెల్లగా మార్చడానికి సులభమైన చిట్కాలు.

Author:

చర్మానికి ఏ మాత్రం ఎండ తగిలినా వెంటనే చర్మం నల్లగా కమిలినట్లు మారిపోతుంది. ఇలా వాతావరణంలో జరిగే  మార్పుల వల్ల చర్మం రంగులో మార్పులు వస్తే దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది ఒక చర్మ సమస్య. అసలే కొద్ది రోజుల్లో వేసవికాలం మొదలవబోతుంది. అయితే ఇలా సహజమైన చర్మం రంగు కోల్పోయి చర్మం నల్లగా మారడాన్ని ఏ ఒక్కరూ కోరుకోరు. ముఖ్యంగా, మహిళలు మరియు యువకులు ఏ సమస్యతో చాలా భాద పడుతుంటారు. ఈ సమస్య నుండి బయట పడటానికి  కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి, ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే ఈ హోం రెమెడీస్ అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతాయి.రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య ఉండదు. వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యవతం. ఎందుకంటే ఈ హోం రెమెడీస్ మనకు అతి చౌకగా అందుబాటులో ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో ఒకసారి తెలుసుకుందాం…

easy-ways-to-treat-hyperpigmentation

  • చర్మం నల్లగా ఉన్న ప్రదేశంలో పాలను అప్లై చేయాలి. 10-15 నిముషాల తర్వాత కాటన్ తో తుడిచేసుకోవాలి. మంచి ఫలితం కనబడే వరకూ దీన్ని ప్రతి రోజూ చేయాల్సి ఉంటుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించటమే కాక, చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా చర్మంను సున్నితంగా గా మార్చుతుంది.
  • నిమ్మ రసాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంతే కాదు ఇది చర్మాన్ని సున్నితంగా మరియు కాంతివంతంగా మార్చుతుంది.
  • హైపర్ పిగ్మెంటేషన్ సమస్యకు ముఖ్య కారణం చర్మం పొడిగా మారడం. పొడి చర్మంని నివారించడానికి అలోవెర జెల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి రోజూ రాత్రి నిద్ర పోయే ముందు అప్లై చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • పాలతో శెనగపిండి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా చర్మాన్ని మర్ధన చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుముఖం పడుతుంది. పొడిచర్మం సమస్య నుండి బయట పడేందుకు శనగపిండి అద్భుతంగా సహాయపడుతుంది. అందుకే, ఎక్కువ మంది శీతాకాలంలో సబ్బుకి బదులు శనగపిండిని ఉపయోగించి స్నానం చేస్తారు.
  • స్ట్రాబెర్రీలో ఉండే యాసిడ్స్ చర్మం యొక్క కాంతిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. దాంతో స్కిన్ పిగ్మెంటేషన్ శక్తివంతంగా నివారించబడుతుంది.
  • బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. బొప్పాయిని మెత్తగా మ్యాష్ చేసి, ముఖానికి ప్యాక్ లాగ అప్లై చేయాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ తో స్కిన్ పిగ్మెంటేషన్ తొలగిపోతుంది.
(Visited 8,771 times, 1 visits today)