Home / Inspiring Stories / ఇద్దరూ అమ్మాయిలే అయినా పెళ్ళి చేసుకున్నారు.

ఇద్దరూ అమ్మాయిలే అయినా పెళ్ళి చేసుకున్నారు.

Author:

ఆ ఇద్దరూ బందువులే ఒకరినొకరు ఇష్టపడ్డారు,ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నారు. మేజర్లే అయీనా వాళ్ళ తల్లి తండ్రులు మాత్రం ఈ పెళ్ళికి ససేమిరా అనటం తో ఇక లాభం లేదనుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయి సహ జీవనం చేస్తున్నారు అయినా ఇద్దరి తల్లితండ్రులూ ఒప్పుకోలేదు…

“ఈ పెద్దాళ్ళింతే పిల్లల ప్రేమని ఎప్పటికీ ఒప్పుకోరు అయినా ఆ అబ్బాయి జీవితం లో స్థిర పడ్డాక పెళ్ళి చేసుకుంటే ఏమిటి ఇబ్బంది? అన బోతున్నారా ఆగండాగండి.. వాళ్ళు ప్రేమికులన్నాం గానీ అబ్బాయీ అమ్మాయీ అన్నామా..!? ఏమిటలా చూస్తున్నారు మీ అనుమానం నిజమే వాళ్ళిద్దరూ అమ్మాయిలే.. ఇక్కడ మనకు కొత్త గానీ ఇది పాశ్చాత్య దేశాల్లో ఎప్పటినుంచో ఉంది ఇప్పుడిప్పుడే సమాజమూ,కోర్టులూ వాళ్ళని అంగీకరిస్తున్నయి కూడా. ఐతే ఈ సంఘటన జరిగిన మన నల్లగొండ జిల్లా జనాలు ఇంకా అంత ఎదగక పోవటం తో సమస్య మొదలైంది.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల శ్రీదేవి, వేములపల్లి మండలం శెట్టిపాలెం పరిధిలోని రావువారిగూడేనికి చెందిన మణి వరసకు వదినా మరదళ్లు. ఒకరినొకరు విడదీయలేనంత ప్రేమ. అందుకే ఇద్దరూ పెళ్లి చేసుకుంటామన్నారు. ఆడాళ్లిద్దరికీ పెళ్లేంటన్న పెద్దలు చీవాట్లు పెట్టారు. విడదీశారు. పెద్దల నుంచి సూటిపోటి మాటలు భరించలేక రెండేళ్ల కిందట ఇంటి నుంచి పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. భార్యా భర్తల్లాగానే కలిసుంటామంటున్నారు. అనడమే కాదు మూడేళ్ల నుంచి అలాగే ఉంటున్నారు కూడా. కానీ ఈ పెద్ద వాళ్ళకి ఇది నచ్చలేదు. ఇద్దరినీ పట్టుకొని విడదీసారు. అంతేకాదు శ్రీదేవికి పెళ్ళికూడా చేసారు కానీ మణిపై ప్రేమతోనే ఆమె భర్తను కూడా వదిలేసిందట.

ఇక లాభం లేదు అనుకొని తమ అమ్మాయిని చెడగొడుతోందంటూ శ్రీదేవి పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో సీను పోలీస్ స్టేషన్ కి మారింది. అక్కడ కూడా ఈ ప్రేమికులిద్దరూ పోలీసుల కౌన్సిలింగ్ కి కూడా లొంగ కుండా తాము మేజర్ల మనీ, విడదీయాలని చూస్తే ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటామనీ చెప్పటం తో. పోలీసులు కూడా వదిలేసారు.ఇప్పుడు వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరగనుందో తెలియదు కానీ స్వలింగ సంపర్కుల చట్టం పై మన దేశం ఒక నిర్ణయానికి వచ్చే వరకూ వీరికిలాంటి కష్టాలు తప్పవనిపిస్తోంది.. ఐనా మనదేశం లో అలాంటి చట్టాల గురించి కనీసం ఆలోచించే పరిస్థితయినా ఎప్పటికి వచ్చేనో….

(Visited 104 times, 1 visits today)