Home / Videos / ఏదో ఒకరోజు చావు మనదీ కావొచ్చు రైతులని కాపాడుకుందాం.

ఏదో ఒకరోజు చావు మనదీ కావొచ్చు రైతులని కాపాడుకుందాం.

భారత్ అంటే ఒకప్పుడు వ్యవసాయమే గుర్తొచ్చేది గ్రామం అంటే పచ్చని పంటల క్షేత్రాలు కళ్ళ ముందు కదిలేవి ఒక్కొక్క ప్రాణం నేలలో ఇంకిపోయి మొలకలుగా మొక్కలు గా జీవాన్ని అందించేది… రైతు చెమటతో తడిసిన భూమి దేశానికి అన్నం పెట్టేది….

దృశ్యం మారింది ఫ్యాక్టరీలు, సాఫ్ట్ వేర్ లూ ఐటీ లో తన విజయ పతాకాన్నెగరేసిన ఇండియా మరోసారి తన మూలాలని వెతుక్కోవాల్సిన సమయం వచ్చింది. ప్రాణాలొదిలేస్తున్నది రైతు ఒక్కడేనా..!? కాదు మన ప్రాణాలు ఒక్కొక్కొక్కటే వదిలేస్తున్నాం.. వేలాది రైతుల మరణాలు ఒక్కొక్కటీ మనలని, ఈ దేశాన్నీ చావు అంచుకు తీసుకు వెళుతున్నాయ్..ఎన్.సి.ఆర్.బి నివేదిక ప్రకారం 1995 నుండి 2010 వరకూ 16 సంవత్సరాల కాలంలో 2,56,913 మంది రైతులు భారత దేశం మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించింది. అంటే పావు మిలియన్ మంది రైతులన్న మాట! ఈ సంస్ధ ఆత్మహత్యల సంఖ్యని రికార్డు చేయడం ప్రారంభించింది 1995 నుండే కనుక అంతకు ముందు, రైతులు ఎంత మంది ఆత్మహత్య చేసుకుందీ తెలిసే అవకాశం లేదు. బహుశా మానవ జాతి చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున బలవంతంగా తమ ప్రాణాలను తామే తీసుకున్న దౌర్భాగ్యం బహుశా ఇండియాలోనే జరిగి ఉండవచ్చు..  రైతు ఆత్మ హత్యల నేపధ్యం లో చేసిన ఈ వీడియో మిమ్మల్ని కదిలించక మానదు. ఒక్కొక్క రైతూ ఒక్కో నక్షత్రమై పోతున్నట్టు ఆ పిల్ల లెక్కించే చావుల లెక్క లో ఎప్పుడో ఒకప్పుడు మనమూ చేరి పోతామేమో…

(Visited 769 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]