Home / Entertainment / ఈ సాయంత్రం బ్రూస్లీ ఆడియో.

ఈ సాయంత్రం బ్రూస్లీ ఆడియో.

Author:

రామ్‌చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ప్రధాన పాత్రల్లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్‌లీ’ ఆడియో ముందు చెప్పిన విధంగానే ఈ సాయంత్రం విడుదల కానుంది. వేదిక విషయం లో కొద్ది కాలంగా ఉన్న అనుమానాలు కూడా తొలగిపోయాయి. మెగా ఫ్యామిలీ సినిమా ఆడియో వేడుక‌లు ఎక్కుగా శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌రిగేవి. కానీ ఈసారీ మాత్రం హైటెక్స్ గ్రౌండ్స్ ను వేదిక‌గా ఎంచుకున్నారు. ఆడియో లాంచ్ పాస్ లలో వేదిక పేరుని కలిపి ప్రింట్ చేసి అభిమానులకు, సెలబ్రిటీలకు పంచనున్నారట‌. ఎందుకు ఈ సెంటిమెంట్? అంటే అభిమానుల తాకిడి త‌ట్టుకోలేక వేదిక మార్చాల్సి వ‌స్తుంద‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. హైదరాబాద్ హైటెక్స్ గ్రౌండ్ లో ఘనంగా ఈ వేడుక జరగనుంది.ఈ సాయంత్రమే పలువురు సినీ ప్రముఖులు ‘బ్రూస్‌లీ’ గీతాలను విడుదల చేయనున్నారు. టాప్ టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ ఫంక్షన్ కు హాజరవనున్నారని సమాచారం. ఐతే ఎంతోకాలంగా పవన్ రాక పై ఉన్న అనుమనాలు మాత్రం అలానే ఉన్నాయ్. బాబాయ్ పుట్టిన రోజు గిఫ్ట్ గా తన బ్రూస్లీ టీజర్ ని ఇచ్చి ఐస్ చేసినా పవన్ కళ్యాన్ ఈ వేదిక పై కనిపించటం చివరి వరకూ అనుమానమే అంటున్నారు ఫిలిం నగర్లో జనాలు. తాజాగా చిత్రంలోని ఒక సాంగ్ మేకింగ్‌ వీడియో విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు థమన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంగీత దర్శకుడు తమన్ బాబు బ్రూస్లీ కోసం అదిరి పోయే బీట్ ఉన్న ట్యూన్లనిచ్చాడట.ఇప్పటికే విదుదలైన లేచలో అనే పాట మేకింగ్ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఫ్యాన్స్ అత్యుత్సాహం వలన, ఇప్పటికే ఇంట్రడక్షన్ సాంగ్ ఆడియో లీక్ అయిపోయింది. లూప్‌లో పెట్టి, ఎంజాయ్ చేస్తున్నారు. “రన్ లైఫ్ అంటే రేసు రా రన్” అనే సాంగ్ మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ గా ఉంటే.”బ్రూస్ లీ” అనే టైటిల్ సాంగ్ మంచి బీట్ తో హై టెన్షన్ సాంగ్ గా ఉంటుందట. ఈ ఆడియో రైట్స్ ని జీ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో జీ మ్యూజిక్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవుతోంది.

(Visited 37 times, 1 visits today)