Home / Inspiring Stories / రెండు కళ్ళు లేకున్నా కృషితో 50 కోట్ల కంపెనీకి సీఈఓ అయ్యాడు.

రెండు కళ్ళు లేకున్నా కృషితో 50 కోట్ల కంపెనీకి సీఈఓ అయ్యాడు.

Author:

Srikanth-Bolla 3

శ్రీకాంత్ బొల్ల…. 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ కి సీఈవో.అమెరికా లోని మస్సాచు సెట్స్ యూనివర్సిటీ లో చదువుకున్నాడు. తన కంపెనీ ని సక్సెస్ గ్రాఫ్ లో ముందుచడానికి కష్టపడే ఈ యువకుడిని ఒకప్పుడు. చూసి నవ్విన వాళ్ళే అంతా.,ఆఖరికి మంచి ర్యాంక్ వచ్చినా ఐఐటీ ఇతన్ని తమ క్యాంపస్ లోకి రానివ్వలేదు సీట్ ఇవ్వటానికి నిరాకరించారు… ఎందుకంటే శ్రీకాంత్ అంథుడన్న కారణం తో. ఔను..! ఈరోజు సక్సెస్ ఫుల్ గా ఒక కంపెనీనే లీడ్ చేస్తున్న ఇతన్ని కేవలం కళ్ళు కనిపించవు అన్న కారణం తో ప్రతీ చోటా అవమానించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లె టూరిలో పుట్టాడు శ్రీకాంత్.చిన్నప్పుడే కళ్ళు కనిపించవు అని తెలిసిన బందువులూ,ఇరుగు పొరుగు వాళ్ళూ ఏదైనా ఆస్రమం లో చేర్పించేయమన్నారట. కానీ కన్న ప్రేమ వాళ్ళనా పని చేయనివ్వలేదు… 1600 రూపాయల సంపాదన అయినా తమ కొడుకుకి ఏ లోటూ రాకుండా ఉందాలనుకున్నారు. శ్రీకాంత్ ని ఊరిలో ఉన్న స్కూలుకి పంపించారు. అయితే అక్కడ ఉన్న పిల్లలే కాదు టీచర్లు కూడా శ్రీకాంత్ ని ఎప్పుడూ గేలి చేస్తూనే ఉండేవాళ్ళు. అతని వైకల్యాన్ని చూసి జాలిపడటం మాని అతన్ని వేదించేవాళ్ళు.. దాంతో అక్కడ స్కూల్ మానిపించి ఏలాగోలా అంధుల పాఠశాలలొ చేర్పించాడతని తండ్రి…

పదవ తరగతి లోనూ,ప్లస్ టూ లోనూ 90% మార్కులు తెచ్చుకున్నాడు,అంతే కాదు క్రికెట్ లోనూ చెస్ లోనూ చాంపియన్ గా నిలిచాడు కూడా.కానీ మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. ఐఐటీ తో పాటుగా ఇంజినీరింగ్ చదవటానికి అప్లై చేసిన ఏ కాలేజ్ కూడా ఎంట్రన్స్ ఎగ్జాం క్లోసం కనీసం హాల్ టికెట్ కూడా పంపించలేదు.ఎందుకంటే అతను వికలాంగుడన్న కారణం చూపించారు. కానీ తన ప్రతిభ తో లీడ్ ఇండియా ప్రాజెక్ట్ లో చటు లభించింది. సాక్షాత్తూ మన మాజీ రాష్ట్ర పతి దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం చేపట్టిన ప్రాజెఖ్త్ లో మరింత చదువుకునే అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది.

Srikanth-Bolla 2

ఐఐటీ నిరాకరించిన శ్రీకాంత్ ఇంజినీర్ అవ్వాలన్న తన కల కోసం మరింత గా కృషి చేసాడు. విదేశాల్లోని యూనివర్సిటీలకు అప్లై చేసాడు. మస్సాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సీట్ వచ్చింది. తమ యూనివర్సిటీ లో చేరమంటూ యూనివసిటీ నుంచి ఆహ్వానం అందింది. ఆ యూనివర్సిటీ లో అడ్మిషన్ పొందిన మొట్టమొదటి విదేశీ విద్యార్థి శ్రీకాంత్ మాత్రమే. చదువు పూర్తయిన వెంటనే తిరిగు భారత్ లో అడుగు పెట్టాడు. తన లాంటి మరికొందరికి చేయూత అందించాలని నిర్ణయించుకున్నాడు.

“ఇప్పటివరకూ 3000 మంది విద్యార్థులకు విధ్యని అందించటమే కాదు వృత్తి విధ్యా కోర్సుల్లోనూ శిక్షణ ఇచ్చాం కానీ వారి కి ఉపాథి ఎలా ? అందుకే ఈ కంపెనీ మొదలు పెట్టాం. ఇప్పుడు మా కంపెనీలో 150 మంది రకరకాల వృత్తి నిపుణులు ఉన్నారు అంతా ఏదో ఒక భౌతిక అవయవ లోపం ఉన్నవారే…” ఒక పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు శ్రీ కాంత్..

Srikanth-Bolla 2

ఒక అవయవం లోపించిందన్న కారణం తో ఇన్ని కాలేజీలు కనీసం చేర్చుకోవటానికి కూడా ఒప్పుకోని అతను ఇప్పుడు… తానే మాత్రం లోపం ఉన్న వాదిని కానని నిరూపిస్తూ 50 కోట్ల టర్నొఈవర్ సాధించే కంపెనీ కి సీఈఓ అయ్యాడు… తను మిగిలిన వారికంటే తక్కువ అని ఒప్పుకోకపోగా తనంటే ఏమిటో చూపించాడు…

(Visited 3,163 times, 1 visits today)