Home / Inspiring Stories / సెక్యూరిటీ గార్డు నుండి నేషనల్‌ అవార్డ్ ఫిలీం మేకర్ గా ఎరె గౌడా

సెక్యూరిటీ గార్డు నుండి నేషనల్‌ అవార్డ్ ఫిలీం మేకర్ గా ఎరె గౌడా

Author:

విధి ఆడే చదరంగంలో మనమంతా కేవలం పావులం మాత్రమే అంటారు మన పెద్దవారు. ఈ జీవితం అనే ఆటలో చాలా మంది రాజులు భటులు అయ్యారు. భటులు కాస్తా రాజులుగా ఏలినారు. అదే జీవితం అంటే. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో.. ముందే ఎవ్వరు చెప్పలేరు. మనం ఇప్పుడు కథ లాగా అనిపించే నిజ జీవితంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడబోతున్నాం. “ఎరె గౌడా” ఇతని కథ మనకు ఒక డైలీ సీరియల్ లా అనిపిస్తుంది. ఎందుకంటే అతడు కష్టాలలో పుట్టి కష్టాలలో పెరిగాడు. కానీ ఇతని మొదటి ఫ్యూచర్ ఫిలీం “తిథి” చాలా ఇంటర్నేషనల్‌ అవార్డ్స్ తెచ్చిపెట్టింది.

ere Gouda with ram reddy

ఎరె గౌడాది చాలా పేద కుటుంబం. తన కుటుంబానికి చిన్నతనం నుండే చేదొడు వాదోడుగా ఉండేవాడు. తన తల్లికి క్యాన్సర్ సోకిందనే విషయం తెలిసే సమయానికి ‘ఎరె గౌడా’ పదవ తరగతి పూర్తి చేశాడు. తల్లి ఆరోగ్యం కోసం మొదటగా మైసూరులోని ఆటోమొబైల్‌ కంపెనీలో నెలకు 850 రూపాయలకు సెక్యూరిటీ గార్డు గా పనికి చేరాడు. ఆ తర్వాత అతనికి వచ్చే జీతం సరిపోక కొన్ని రోజులకు తెలిసిన వారు చెప్పడంతో బెంగుళూర్ లో ప్రొడ్యూసర్ అయిన ప్రతాప్ రెడ్డి ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అదే సమయంలో ప్రతాప్ రెడ్డి కొడుకు రామ్ రెడ్డి తో పరిచయం ఏర్పడింది. రామ్ రోజు స్కూల్ నుండి రాగానే ఇద్దరు కలసి క్రికెట్, టెన్నిస్ కలసి ఆడుకునేవారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే రామ్ కి కన్నడ రాదు, ఎరె కి ఇంగ్లీష్ రాదు, కానీ వారి స్నేహనికి మాత్రం వారి భాష అడ్డు రాలేదు. మూడు సంవత్సరాల క్రితం ఎరె వాళ్ళ అమ్మ చనిపోయింది. దానితో తన ఊరికి వెళ్ళి ఏదైన పని చుసుకుంటా..! అనుకున్నాడు. కానీ. రామ్ అందుకు ఒప్పుకోక పోగా, వాళ్ళ అమ్మ నడుపుతున్న ఎన్‌జీఓ లో ఆఫీస్‌బాయిగా చేర్పించాడు. ఎరె ఉండేది ఆ ఆఫీసులోనే కాబట్టి ఆఫీసులో సాయంత్ర సమయంలో కంప్యూటర్ తనకు తానే సొంతంగా నేర్చుకుని, తర్వాత కాలంలో డాటా ఎంట్రీ లాంటి పెద్ద ఉద్యోగం చేయొచ్చని ఆశ పడేవాడు. అలా కంప్యూటర్ పై పట్టు సాదించాడు.

ఆ సమయంలోనే చదువుకుంటున్న రాం రెడ్డికి సినిమాలపై ఇష్టం ఏర్పడింది. కాలేజ్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలనుకున్నారు. అలా మొదలైన వారి ఆలోచన డిఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాతో టెస్ట్‌ మూవీలా ‘ఈక’ తీశారు. దానికి 21 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో చాలా అవార్డులు వచ్చాయి. దానితో వారిద్దరు కలసి ప్యూచర్ ఫిల్మ్ తీయాలని ఆలోచనలో ఉండగా, రాం రెడ్డిని ఎరె వారి ఊరికి తీసుకెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలు అక్కడి పరిస్థితులు అన్ని రాంరెడ్డికి వివరించడంతో అప్పుడే “తిథి” సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. ఈ సినిమాకి సంబందించిన కథ, స్క్రీన్ ప్లే తో పాటు సినిమాకు సంబందించిన ప్రతి విషయంలో ఎరె గౌడా సహాయం చేశాడు. ఈ ‘తిథి’ సినిమా ఫిల్మ్‌ ఫెస్టివల్ లో రిలీజ్ చేశారు. అంతే, 6నెలల లోపు 7 అవార్డ్స్ వచ్చాయి. అందులో లోకర్నో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో బెస్ట్‌ ఫిల్మ్‌తో పాటు కన్నడలో బెస్ట్ గోల్డెన్‌ లెపార్డ్‌ అవార్డు సాధించింది.

(Visited 443 times, 1 visits today)