Home / Inspiring Stories / ఎత్తుగడల మాంత్రికుడు ఒవైసీ…వేచి చూసే యోధుడు ఒమర్ ల దోస్తీ!?

ఎత్తుగడల మాంత్రికుడు ఒవైసీ…వేచి చూసే యోధుడు ఒమర్ ల దోస్తీ!?

Author:

మజ్లిస్ అధినేత అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. బీహార్ లో పాగా వేయటానికి ఒక పక్క అసెంబ్లీ ఎన్నికలను వేదికగా చేసుకుంటూనే, మరో పక్క జమ్మూ కాశ్మీర్ లో స్వతంత్ర ఏం ఎల్ ఏ పై దాడి ఘటన లోనూ తల దూర్చటం ద్వారా ముస్లిం సమాజ పరిరక్షకుడిగా తనదైన ముద్ర జాతీయ స్థాయిలో వేసుకునే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ,మహారాష్ట్ర అసెంబ్లీ లో రెండు స్థానాల్లో పాగా వేసిన మజ్లిస్ చూపు ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పంచాయత్ ఎన్నికలవైపు, అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలవైపు సారించటాన్ని బట్టి చూస్తే, ఆయన ఎత్తుగడలు, వ్యూహాల స్థాయి ఏ మేరకు ఎగబాకిందో ఇట్టే అర్ధమైపోతుంది. ఇప్పటికే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ , చిన్నా చితకా ముస్లిం రాజకీయ వేదికల మధ్య ఒక అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించటం లో సక్సెస్ అయిన అసదుద్దీన్ ఒవైసీ….తన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాదిరి దూకుడుగా కాకుండా….సమయానుకూల ఎత్తుగడలతో ….ఉత్తర భారత దేశం లో మజ్లిస్ విస్తరణ కు వ్యూహం పన్నుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తో ఆయన పలు మార్లు సమావేశమయ్యారనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి జమ్మూ కాశ్మీర్ లో మజ్లిస్ ఉనికి కోసం ఇప్పటి నుంచే ప్లాట్ ఫార్మ్ తయారు చేసుకుంటున్నారనీ ఢిల్లీ వర్గాల భోగట్టా. ఉన్నత విద్యాధికుడైన అసదుద్దీన్ ఒవైసీ వివిధ జాతీయ ఛానెల్స్ లో ఇటీవల తరచూ కనిపిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరో పక్క , ఒమర్ అబ్దుల్లా తో ఒవైసీ దోస్తీ ని పటిష్టం చేయటం కోసం ….కొందరు సీనియర్ హురియత్ నేతలు కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే, 2019 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశ వ్యాప్తంగా ఒక ముస్లిం రాజకీయ పార్టీల కూటమి ఆవిర్భవించినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది ఢిల్లీ విశ్లేషకుల అంచనా! ఈ కూటమి 2019 సార్వత్రిక ఎన్నికల్లో అవలంబవలసిన విధి విధానాల మీద, అలాగే అన్నీ ముస్లిం పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే క్రమం మీద ఇహ మీదట తరచూ జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిల్లోనూ సుహృద్భావ సమావేశాలు నిర్వహించుకోవాలనే విషయంలోనూ ఒవైసీ..ఒమర్ అబ్దుల్లా ల నడుమ ఒక సూత్ర ప్రాయ అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. సహజంగానీ ఇలాంటి వార్తలను ధృవీకరించటానికీ, ఖండించటానికీ ఆ రెండు పార్టీల నేతలు అందుబాటులో లేరు.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లో స్వతంత్ర ఏం ఎల్ ఏ పై బీ జె పి ఏం ఎల్ ఏ లు దాడి చేయటాన్ని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు. బీఫ్ వినియోగంపై సుప్రీం కోర్టు లో స్టే ఉండగా, బీజె పీ ఏం ఎల్ ఏ లు ఇలా దూకుడు గా వ్యవహరించటాన్ని ఆయన ఖండించారు. మరో వైపు, మహమ్మద్ అఖ్లక్ సంఘటన తో అల్లకల్లోలంగా మారిన ‘విశద’ గ్రామంలోని హిందూ కుటుంబాలకు అవసరమైతే తుపాకులను సరఫరా చేయటానికి బీ జె పి ఏం.పి. యోగి ఆదిత్య నాధ్ సిద్ధంగా ఉన్నారట! ఆ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ఆ గ్రామంలోని హిందూ కుటుంబాలను అధికారులు వేధిస్తున్నారనే వార్తలు రావటం తో ..హిందూ యువ వాహిని కార్యకర్తలు ‘విశద’ గ్రామంలోకి చొచ్చుకెళ్ళటానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కిందటి నెల 28 న జరిగిన అఖ్లక్ హత్య ను దురదృష్ట కర ఘటన గా అభివర్ణించిన హిందూ యువ వాహిని నేత జితేంద్ర త్యాగి – ఆ సంఘటనపై సి బి ఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనల సమయంలో అఖ్లక్ లాంటి ముస్లిం కుటుంబాలకు మాత్రమే ఎందుకు నష్ట పరిహారం చెల్లిస్తున్నారు? జయ ప్రకాష్ అనే యువకుడు మరణిస్తే, ఆ యువకుడి కుటుంబానికి ఎందుకు సాయం అందించటం లేదు? అని ఆయన ప్రశించారు. గోవులను చంపిన వారి కుటుంబాల వారికి నష్టపరిహారం చెల్లించటం ఏమిటని ఆయన నిలదీశారు. ‘తాన్-మన్-ధన్-గన్’..ఇందులో ఏది అవసరమైతే దాన్ని,విశద లో ఉన్న హిందూ కుటుంబాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు జితేంద్ర త్యాగి ప్రకటించారు.

(Visited 104 times, 1 visits today)