Home / Inspiring Stories / ప్రజల కోసం తన ఆస్తులు ధారపోసి, వృద్ధాప్య పింఛన్‌ రాక ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్‌

ప్రజల కోసం తన ఆస్తులు ధారపోసి, వృద్ధాప్య పింఛన్‌ రాక ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్‌

Author:

ఒక్కప్పుడు ప్రజాప్రతినిధి అంటే ఎవరైన సహాయం కోరి వస్తే తింటున్న అన్నం కూడా వదిలి సహాయం చేసి పంపేవారు. కానీ ఈ రోజులలో ఎలా ఉన్నారో చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటి రాజకీయ ప్రజాప్రతినిధులు ఎలా ఉంటున్నారో..! కానీ, ఒక వ్యక్తి మాత్రం మనం మొదట అనుకున్నట్టు తన ఊరి కోసం తన ఇరవై ఎకరాల భూమిని అమ్మి ఊరి ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలు చేశాడు.

ఆయన ఓ మాజీ సర్పంచ్‌. తన ఐదేళ్ల పదవీకాలంలో ఎంతగానో నీతి, నిజాయితీగా పనిచేసి  గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ఎవరు, ఎప్పుడు, ఏ పని కోసం వచ్చినా.. తన సొంత ఖర్చులతో చేసిపెట్టారు. ఎవరి వద్దనుంచీ నయాపైసా కూడా ఆశించలేదు.కానీ చివరికి ప్రజ సేవలో తన ఆస్తి అంత పోయింది. ఒకప్పుడు తన కోసం ప్రభుత్వ ఉద్యోగులు  ఎదురుచూసేవారు. కానీ, ఇప్పుడు తానే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వృద్ధాప్య ఫించన్ కోసం తిరిగి తిరిగి చివరికి ప్రభుత్వ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడు.

Sarpanch Suicide in Nizamabad

నిజామాబాద్‌ జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన పైడి నర్సింహారెడ్డి(65) నిజాయితికి మారు పేరు. ఆయన ముందుగా ఉపసర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు ఆ సమయంలోనే ఊరిలో మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత ప్రజలందరి సహాయంతో సర్పంచ్‌గా ఎన్నికైయ్యాడు, ప్రజలకు ఏ కష్టం వచ్చిన అందరు అతని గడప ముందు వాలిపోయేవారు తను కూడా లేదనకుంట వచ్చిన వారికి సాహాయం చేసేవాడు. అలా అడిగిన వారికి కాదనకుండ ఇవ్వడం, కాలంతో పాటు తన 5సంవత్సరాల పదవి కాలంలోనే తన 20ఎకరాల ఆస్తి కరిగిపోయింది. ఆస్తులన్నీ కరిగిపోవడంతో బతుకుదెరువు కోసం కొన్నేళ్లు విజయవాడ, హైదరాబాద్‌లలో ప్రైవేటు కంపెనీల్లో పనిచేశారు. వారు ఇచ్చే జీతం చాలక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. చివరికి మళ్లీ తన సొంత గ్రామానికి చేరుకున్నారు. పింఛన్‌ కోసం ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరిగారు. అయినా వారు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి గురువారం రాత్రి ఎంపీడీవో కార్యాలయం వద్దే పురుగుల మందు తాగి తనువు చాలించాడు.

ఇది మన దేశంలో ఒక నిజాయితి గల నాయకుడికి ఇచ్చే ఒక బహుమానం. ఒక్కప్పుడు ప్రభుత్వం మరియు అధికారుల నుండి ఎలాంటి అవసరం ఆశించకుండా అన్ని సౌకర్యాలు ప్రజలకు చేసి పెడితే, ఇప్పుడు  తనకు ప్రభుత్వం మరియు ప్రభుత్వ సిబ్బంది ఇచ్చిన బహుమానం తన చావు. పాపం ఈ నర్సింహారెడ్డి కి తెలియదు, తన వంటి నిజాయితి పరులకు ఇక్కడ స్థానం లేదు అని.

(Visited 4,343 times, 1 visits today)