Home / Entertainment / క్రేజీ డైరెక్టర్ కి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ రైట్స్.

క్రేజీ డైరెక్టర్ కి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ రైట్స్.

Author:

Express Raja Movie

సినిమా సినిమాకి ఏదోఒక వైవిధ్యం చూపడానికి ఇష్టపడే యంగ్ హీరో శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తర్వాత మరోసారి ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ చేసిన సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’.  ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తొలి హిట్ అందుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ .

ట్రైలర్ పూర్తి ఎంటర్టైనింగ్ గా ఉండడం వలన, అలాగే యువి క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దాంతో ఈ మూవీ బిజినెస్ కూడా జోరు మీదుంది.

తాజాగా క్రేజీ డైరెక్టర్ మారుతి కృష్ణా జిల్లాకి చెందిన రైట్స్ దక్కించుకున్నారు. ఇలా స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతుండడం సినిమాకి ఇంకా పెద్ద హెల్ప్ అవుతోంది. టాప్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు ఈ మూవీ నైజాం రైట్స్ తీసుకున్నారని ఇది వరకే తెలిపాం. ఈ సినిమా సెన్సార్ నుంచి క్లీన్ ‘యు’తో జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

(Visited 117 times, 1 visits today)