Home / Entertainment / సంక్రాంతి కానుకగా దిల్ రాజు చేతికి మరో మూవీ రైట్స్.

సంక్రాంతి కానుకగా దిల్ రాజు చేతికి మరో మూవీ రైట్స్.

Author:

Express Raja Movie

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ లో ఒకరైన దిల్ రాజు సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న క్రేజీ ప్రాజెక్ట్స్ నిజాం రైట్స్ ని దక్కించుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమా నైజాం రైట్స్ ని భారీ మొత్తానికి కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవలే బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమా నైజాం రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.

యువి క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించాడు. ట్రైలర్ పూర్తి ఎంటర్టైనింగ్ గా ఉండడం వలన, సెన్సార్ కూడా పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా జనవరి 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది.

(Visited 124 times, 1 visits today)