Home / Latest Alajadi / మన ఫేస్ బుక్ అకౌంట్ తో ఫేస్ బుక్ కంపెనీ ఎంత సంపాదిస్తుందో తెలుసా…?

మన ఫేస్ బుక్ అకౌంట్ తో ఫేస్ బుక్ కంపెనీ ఎంత సంపాదిస్తుందో తెలుసా…?

Author:

ఈరోజుల్లో పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎక్కువ సమయం ఫేస్ బుక్ లోనే చాలామంది గడుపుతున్నారు, మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం అనేది ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్న ఫేస్ బుక్ లో ఉన్నవాళ్ళకి మాత్రం చెప్పేస్తున్నాం, మనకి తెలియకుండానే మనం ఎక్కువ సమయాన్ని ఫేస్ బుక్ లోనే గడిపేస్తున్నాం, ఫేస్ బుక్ ని వాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నారంటే అది మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు, ఇప్పుడైతే ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఫేస్ బుక్ ని వాడేస్తున్నారు, పక్కనున్న మనుషులని వదిలేసి ఫేస్ బుక్ లోనే మునిగిపోతున్నారు అంతలా మన జీవితాల్లోకి చొచ్చుకుపోయింది.

facebook-Earning-From-Accounts

అంతలా జనాలు ఫేస్ బుక్ వాడుతుండటంతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు అయిన మార్క్ జుకర్ బర్గ్ కోట్లాది సంపద వచ్చి పడుతుంది, కొన్ని సంవత్సరాలలోనే ప్రపంచంలోనే ఎక్కువ సంపద ఉన్నవారిలో ఆరో స్థానంలో నిలిచాడు మార్క్, మన ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారానే అన్ని కోట్లని సంపాదిస్తున్నాడు, సగటున ఒక్క అకౌంట్ ద్వారా ఫేస్ బుక్ కంపెనీ సంవత్సరానికి 1056 రూపాయలు ($16) సంపాదిస్తుంది, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 180 కోట్ల ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయి, అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో లెక్క వేసుకోండి, మనం టైం పాస్ వాడే ఫేస్ బుక్ ఒక కంపెనీకి లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే.

(Visited 1,934 times, 1 visits today)