Home / Inspiring Stories / ఏటీఎం నుండి నకిలీ నోట్లు వస్తే ఏం చెయ్యాలో తెలుసుకోండి…!

ఏటీఎం నుండి నకిలీ నోట్లు వస్తే ఏం చెయ్యాలో తెలుసుకోండి…!

Author:

మాములుగా ఎవరైనా పొరపాటున దొంగనోట్లు ఇస్తే ఏం చేస్తాం, వాటిని తిరిగి వారికే ఇచ్చేసి మంచి నోట్లని తీసుకుంటాం, బ్యాంకు లో ఇస్తే అప్పటికప్పుడు నోట్లని మార్చేసుకుంటాం, కాని ఏటీఎం మెషిన్ నుండే దొంగనోట్లు వస్తే ఏం చెయ్యాలో చాలా మందికి తెలియదు, అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్.

ఏటీఎం లలో దొంగనోట్లు వస్తే చాలా మంది వెంటనే బ్యాంకుకి వెళ్లి అడుగుతుంటారు, కాని బ్యాంకు వాళ్ళు తమకు ఏం సంబంధం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డం, దీంతో బాధితులు గ‌గ్గోలు పెట్ట‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణం అయింది, అయితే ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వస్తే వాటిని బ్యాంకు ద్వారానే అసలైన నోట్లని పొందవచ్చు.

fake-notes-from-atm- machine

ఏటీఎంలో దొంగ నోట్లు వస్తే ఇలా చెయ్యండి:

  • ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తే వెంటనే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు చెప్పాలి.
  • సెక్యూరిటీ గార్డు దగ్గర ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు విత్ డ్రా చేసిన మొత్తం, ఓట్ల ఎన్ని నకిలీ నకిలీ నోట్లు వచ్చాయి, వాటి నంబర్లు, సమయం, తేది,ఏటీఎం స్లిప్ నెంబర్ వివరాలని రాసి సంతకం చేయాలి.
  • ఆ తరువాత బ్యాంకుకి వెళ్లి మేనేజర్ కి ఒక లెటర్ ద్వారా కంప్లైట్ చెయ్యాలి, లెటర్ తో పాటు ఏటీఎం స్లిప్ జీరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ లని జత చేసి, ఏటీఎం వద్ద రిజిస్టర్ లో రాసిన వివరాలని అందించాలి.
  • బ్యాంకు వారు మీ దగ్గర ఉండే నకిలీ నోట్లని తీసుకోని వాటిని స్కాన్ చేసి నకిలీ నోట్ల కాదా..! అని పరీక్షిస్తారు.
  • అవి నకిలీ నోట్లే అయితే మీరు ఇచ్చిన వివరాలని సరి చూసుకొని సరైన నోట్లని తిరిగి ఇస్తారు.

*ఇలా కంప్లైంట్ చేసే సమయంలో ఏటియం స్లిప్ ని, నకిలీ నోట్లని, కంప్లైంట్ లెటర్ ని ఫోటోలు తీసి పెట్టుకోవడం ఇంకా మంచిది.

రిజర్వ్ బ్యాంకు నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రతి బ్యాంకు పైన చెప్పిన విధంగా ఖచ్చితంగా చెయ్యాలి, అలా చెయ్యకుండా తమకు ఏం సంబంధం లేదని బ్యాంకు వారు అంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు, రిజర్వ్ బ్యాంకు ఇ-మెయిల్  కి కూడా త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మెయిల్ రూపంలో పంపించ‌వ‌చ్చు, లేక పోతే స్థానికంగా ఉండే బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసి వెంటనే వారి నుండి త‌క్ష‌ణ‌ సహాయాన్ని పొంది బ్యాంకు నుండి నకిలీ నోట్లకి బదులు అసలైన నోట్లని పొందవచ్చు.

రిజర్వ్ బ్యాంకు ఇ-మెయిల్: ClikHere

Must Read: ఏటీఎం కార్డు లేకున్నా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

(Visited 16,320 times, 1 visits today)