Home / Entertainment / బ్రూస్ లీ సినిమాని సక్సెస్ చేసినందుకు అభిమానులకు థాంక్స్ చెప్పిన చిరు.

బ్రూస్ లీ సినిమాని సక్సెస్ చేసినందుకు అభిమానులకు థాంక్స్ చెప్పిన చిరు.

Author:

బ్రూస్ లీ హిట్ టాక్ వచ్చేసినట్టే రాం చరణ్ ఖాతాలో మరో హిట్ చేరినట్టే అంటున్నారు సినీ విశ్లేష కులు. శ్రీను వైట్ల వర్కౌట్ కి తగ్గ ఔట్ పుట్ వచ్చినట్టే అంటున్నారు. చిరు ఎంట్రీ కూడా అద్బుతమైన ఆలోచన సినిమాకి ప్రధాన ఆకర్షణ మెగాస్టార్ అనటం లో ఏమీ సందేహం లేదు.ఈ రోజు పొద్దున్నే వేసిన షో దగ్గరి నుంచే అభిమానుల సందడి మొదలైంది. పొద్దున్నుంచీ ఇప్పటి వరకూ అన్ని చోట్లా థియేటర్స్  ముందు జనాల సందడి ఏమాత్రం తగ్గటం లేదు కూడా. ఒక్క ఫ్లాపుతోనే పెద్ద అపకీర్తి మూటగట్టుకున్న శ్రీను వైట్ల బ్రూస్లీతో ఆ పాత ఙ్ఞాపకాని మర్చిపోతాడౌ అంటున్నారు…

ఇదిలా ఉంటే, బ్రూస్ లీ మూవీకి థియోటర్స్ వద్ద నుండి ఫ్యాన్స్ టాక్ ఎలా ఉందో తెలుసుకోవటానికి మెగాస్టార్ బాగానే ఆసక్తి చూపుతున్నాడట.మెగా ఫ్యాన్స్ అంతా స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి మరీ, “బ్రూస్ లీ” మూవీ టాక్స్ ని వివరిస్తున్నారు. ఇలా “బ్రూస్ లీ” మూవీకి థియోటర్స్ వద్ద నుండి వస్తున్న విశేష స్పంధనకి చిరంజీవి తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.దాదాపు ఆరేళ్ళ తర్వాత తన సెకెండ్ ఇన్నింగ్స్ కి ఒక చిన్న జలక్ గా చేసిన పాత్ర కే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక 150 వ సినిమా వస్తే ఎలా ఉండ బోతుందో చెప్పక్కర లేదుకద…!

విశయం ఏమిటంటే పొద్దున్నే వేసిన బెనిఫిట్ షో లో కొందరు రివ్యూవర్లు కూడా సినిమా చూసి కొన్ని లోపాలను చెప్పటం జరిగింది. “బ్రూస్ లీ” కథ పై డైరెక్టర్ ఇంకా కొద్దిగా వర్కౌట్ చేసి ఉంటే మరింత బావుండేదని చేసిన సూచనలపై చిరుతో కొంత మంది చర్ఛించారంట. అందుకు చిరంజీవి రియాక్ట్ అయి, “మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో అద్భుతంగా నటించాడు. అందులోనూ ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవిగా నేను నటించాను. కథలో ఉన్న కొద్దిపాటి తప్పులు చరణ్, చిరుల హవా లో కొట్టుకుపోతాయి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.“బ్రూస్ లీ” మూవీ గ్రాండ్ సక్సెస్ అనే తెలుస్తుంది. ఈ మూవీని ఇంతలా సక్సెస్ చేసినందుకు ఫ్యాన్స్ కి ధనవాదాలు” అని చెప్పారట. అంతా తన వల్లే అన్న విషయం చిరుకి కూడా అర్థమైనట్టుంది…

(Visited 39 times, 1 visits today)