Home / Inspiring Stories / కూతురి పెళ్లిలో వృధా ఖర్చులని అదుపు చేసి ఆ డబ్బుతో రైతులను ఆదుకుంటున్నాడు.

కూతురి పెళ్లిలో వృధా ఖర్చులని అదుపు చేసి ఆ డబ్బుతో రైతులను ఆదుకుంటున్నాడు.

Author:

Mariage

భారత దేశంలో ప్రతి ఒక్కరు తమ బిడ్డల పెళ్లి ఘనంగా జరిపించాలని అనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చైనా వెనకాడరు. ఆర్థిక స్థోమతను బట్టి లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. కొన్ని సార్లు అప్పులు చేసుకొని మరీ శక్తికి మించిన ఖర్చుల్లో కూరుకు పోతారు. పెళ్లి మండపాన్ని అందంగా తయారుచేయడానికే లక్షల రూపాయలు ఖర్చు చేసేవారున్నారు. ఇదంతా ఎందుకూ అంటే కేవలం మర్యాద కోసం…ఫాల్స్ ప్రిస్టేజ్ కోసమే ఇన్ని లక్షలూ ఏటా ఖర్చౌతున్నాయి… ప్రతీ సంవత్సరం భారత దేశం లో జరిగే పెళ్ళిళ్ళలో కోట్ల రూపాయల డబ్బుతో పాటూ టన్నుల కొద్దీ ఆహార పథార్థాలూ వృధా అయిపోతున్నాయి. అయితే.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా చేయకూడదనుకున్నాడు, దేశం లో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యల కోసం తన వంతుగా ఏదైనా చేద్దాం అనుకున్నడు… అందుకే తన కూతురు పెళ్లిలో వృథా ఖర్చులన్నీ తగ్గించి.. ఆ డబ్బును కరవుతో అల్లాడుతున్న ప్రాంతాల్లోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విరాళంగా అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన పేరు వివేక్ వాడ్కే… మహారాష్ట్రకు చెందిన ఈయన ఏం చేసారంటే….

వర్షాలు లేక.. సరైన దిగుబడి రాక చాలా మంది రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. అప్పుల వూబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితే థానేకు చెందిన వివేక్‌ వాడ్కేను కదిలించింది. కష్టాల్లో ఉన్న రైతన్నలను ఆదుకోవాలనుకున్న అతను వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురు పెళ్లిలో డెకరేషన్‌తో పాటు. వృథా ఖర్చులను తగ్గించాడు. దీని కొసం తనకు కాబోయే అల్లుడిని ఒప్పించాడు. మగ పెళ్ళి వారు కూడా వివేక్ తాపత్రయాన్ని అర్థం చేసుకున్నారు. వరకట్నం వద్దనటమే కాదు వివేక్ చేసే పనికి అండగా నిలిచారు…

అలా ఆదా చేసిన రూ. 6లక్షలను కరువు ప్రభావిత ప్రాంతాలైన నాందేడ్‌, జల్నా జిల్లాల్లోని రెండు గ్రామాల్లో నీటి వసతి పెంపొందించేందుకు విరాళంగా అందించాడు. అంతేకాదు.. దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ వృథా ఖర్చులను తగ్గించి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి తమ వంతు సాయపడాలని వాడ్కే కోరుతున్నాడు. రైతులు రూ.5వేల కోసం ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయని, వీలైనంత ఎక్కువ మంది రైతులను ఆదుకోవడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. అంతేకాదు పదవీ విరమణ చేశాక వీలైనంత ఎక్కువ సమయం రైతులకు కేటాయిస్తానని చెప్పారు.

(Visited 1,380 times, 1 visits today)