Home / Inspiring Stories / దేశ చరిత్రలో మొట్టమొదటి సంవత్సరం ఇదే…

దేశ చరిత్రలో మొట్టమొదటి సంవత్సరం ఇదే…

Author:

వేసవి వస్తుందంటేనే మదిలో రెండు భయాలు మెదులుతూ ఉంటాయి. మొదటి కారణం ఎండలు అయితే, రెండవది కరెంటు కోతలు. వేసవి కాలం అన్నాక ఎండలు ఎలాగు ఉంటాయి, కాని వేసవిలో కరెంటు కోతలు ఉంటే జీర్ణించుకోలేని విషయం. గత సంవత్సరం వరకు ప్రతి ఒక్కరు వేసవిలో కరెంటు కోతలు అనుభవించిన వారే, కానిభారతదేశ చరిత్రలో ఈ ఆర్ధిక సంవత్సరం కరెంటు కోతలు లేని ఏడాదిగా రికార్డు సృష్టించింది.

దేశంలో అవసరాని కంటే 3.1% అధికంగా విద్యుత్ కలిగి ఉన్నట్లు నిపుణులు ప్రకటించారు. ప్రతి ఏడాది వేసవి కాల సమయంలో కరెంటు కోతలు ఖచ్చితంగా ఉండేవని.. కాని ఈసారి అలాంటి సమస్యలు లేవని తెలియజేసారు. భవిషత్తులో మరింత విద్యుత్తు ఉత్పత్తి చేయటం ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని అధికారులు పేర్కొన్నారు.  అధికారులు చెప్పినట్లు ఇలాగే నిరంతరం కరెంటు అందిస్తే దేశ ప్రజలకు ఇది గొప్ప శుభవార్తే.

(Visited 451 times, 1 visits today)