Home / health / ఈ 4 సింపుల్ నియమాలని పాటిస్తే, 120 రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవొచ్చు.!

ఈ 4 సింపుల్ నియమాలని పాటిస్తే, 120 రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవొచ్చు.!

Author:

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవారు . ఎందుకంటే మనం ఏదైనా చేయాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. పూర్వం రోజుల్లో మన వారు శారీరక శ్రమ అధికంగా చేసేవారు దానితో వారికి తెలియకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. ఈ రోజులలో శారీరక శ్రమ తక్కువ మానసిక శ్రమ ఎక్కువ కావడటం వలన అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యనే చాలా మంది మళ్ళీ తిరిగి ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. కానీ ఒక నాలుగు నియమాలు పాటిస్తే దాదాపు 120 రోగాలవరకు మనదగ్గరికి రాకుండా చేసుకోవచ్చు అంటున్నారు డాక్టర్స్. ఈ 4 నియమాలు కూడా మనం నిత్యం తాగే నీటి గురించే అవడం విశేషం.

natural-redemy-for-health

1) కూల్ వాటర్, ఐస్ వాటర్ తాగొద్దు:
ఎక్కువగా కూల్ ఉన్న వాటర్ తాగడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన శరీరంలో ఎప్పుడు ఎదో ఒక క్రియ జరుగుతూనే ఉంటుంది దానితో మన శరీరం అంత వేడిగా ఉంటుంది. కూల్ వాటర్ తాగితే రెండు భిన్న వ్యతిరేకమైన టెంపరేచర్ మన శరీరం మీద పడి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు అంతగా చల్లటి నీళ్లు తాగాలంటే కుండలో నీళ్లు ఆరోగ్యానికి చాల మంచివి.

2) ఎప్పుడు నీళ్లను గటగటా తాగొద్దు :
చాలా మంది నీళ్లను గటగటా తాగుతుంటారు అలా చేయకూడదు. నీళ్లను మనం టీ, కాఫీ ఏవిధంగా తాగుతామో అలాగే తాగాలి. ఎందుకంటే నీళ్లను గటగటా తాగడంవలన శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్యజరపాల్సి ఉంటుంది. దానితో అధిక ఎసిడిటి ఏర్పాడుతుంది. ఈ ఎసిడిటి మన శరీరంలోని రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దానితో అనేక రకాలైన రోగాలు వస్తాయి.నీళ్లను సిప్ చేస్తూ తాగడం వలన ప్రతి గుటక నీటితో, మన నోటిలో ఉండే లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోకి పోతుంది దీనితో ఎలాంటి నష్టం ఉండదు.

3) నిద్రలేవగానే కనీసం 2-3 గ్లాసుల వాటర్ తాగాలి :
ఇలాంటి అలవాటు కొద్దీ మందికి ఉంది వారు లేవగానే ముందు నీళ్లు తాగిన తరువాతనే వేరే ఏదైనా పనిచేస్తారు. ఇలా నిద్రలేవాగానే నీళ్లు తాగడంవలన రాత్రి నుండి ఉదయం వరకు శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలన్నీ మల, మూత్ర విసర్జన రూపంలో బయటకి వెళ్తాయి. ఇలా చేయడం వలన నెంబర్ 1,2 కూడా ఒకే సారి పూర్తీ అవుతాయి. ఒకేసారి రెండు విసర్జిస్తే వారికి రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ.
రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీటిని నింపి ఉదయం లేవాగానే తాగితే మంచి ఫలితం ఉంటుంది…

4) తినడానికి 40 నిమిషాల ముందు తిన్న తరవాత 1 గంట వరకు నీళ్లు తాగొద్దు :
అదేంటి మనం తినే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగుతాం కదా మరి తాగొద్దు అంటున్నారు ఏమిటి అని ఆలోచిస్తున్నారా! నిజానికి తినడానికి ముందు కానీ తిన్న తరవాత కానీ నీళ్లు తాగకూడదు మనం ఎప్పుడైతే తిన్న ఆహారం పొట్టలోని ఈసోపేగాస్ లోకి వెళతాయి. అక్కడ హైడ్రాలిక్ యాసిడ్ సూక్ష్మక్రిములను చంపేసి కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది. తక్కువ PH విలువ కలిగిన హైడ్రోక్లోరిన్ యాసిడ్ ఎంజైమ్ లకు ఉపయోగపడి మనం తిన్న ఆహారం త్వరితంగా జీర్ణమై శక్తిని విడుదలయ్యేలా చేస్తుంది.ఈ ప్రక్రియ జరుగుతున్నా సమయంలో మనం తిన్న వెంటనే నీళ్లు తాగితే, మన జీర్ణ వ్యవస్థ నెమ్మెదిస్తుంది. దానితో జీర్ణం తరువాత వ్యర్థలు శరీరంలో అలాగే మిగిలిపోతాయి. దానితో అనేక రోగాలు వస్తాయి. అందుకే తినడానికి ముందు తిన్న తర్వాత కానీ నీళ్లు తాగొద్దు.

మన శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం, మన శరీరానికి కావాల్సిన నీటిని ప్రతిరోజూ తాగితే అనేక రోగాలని మనకి రాకుండా రక్షించుకోవచ్చు.

(Visited 8,474 times, 1 visits today)