Home / health / మీ పిల్లలు ఎత్తు పెరగటం లేదని భాద పడుతున్నారా!

మీ పిల్లలు ఎత్తు పెరగటం లేదని భాద పడుతున్నారా!

Author:

పిల్లలు వయసుతో పాటు ఎత్తు పెరగకుంటే వారితో పాటు తల్లితండ్రులకు కూడా అది ఒక పెద్ద భాదల తయారు అవుతుంది. ఎత్తు లేకపోవడం వలన పిల్లలు తమలో తాము చాలా కుమిలిపోతారని మరియు ఎగతాలికి గురి అవుతారు అని ఒక సర్వే తెలిపింది. అంతెందుకు మొన్నటికి మొన్న హైదరాబాద్లో మంచి ఎత్తు ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ అబ్బాయి ఇంకా ఎత్తు పెరగటం కోసం ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు పరేషాన్ అవుతున్న విషయం మనం టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం కధ!.  పిల్లలు పెరగకపోవటానికి రెండు కారణాలు ఉంటాయి. 1) వంశపారపర్యంగా సంక్రమించే జీన్స్ వలన  2) సరైన పోషకాహారం లభించకపోవడం వలన.

foods-for-children-height-growth

వంశపారపర్యంగా సంక్రమించే జీన్స్ వలన ఎత్తు పెరగకపోవడాన్ని కూడ కొన్ని సార్లు సరైన పోషకాహారంతో సరిదిద్దవచ్చు. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక్కసారి చూద్దాం:

1) పాలు : ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వలన ఎత్తు పెరుగవుతారు దానికి కారణం పాలల్లో విటమిన్ బి12, ఢీ, అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

2) బఠాణి : బఠాణీలు రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరుగుతారు. ఇందులో ఫైబర్, ప్రోటిన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి.

3) సోయాబీన్ : సోయాబీన్ ప్రతి రోజు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచింది అలాగే ఎత్తు పెరగటం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. ప్రతి రోజు కనీసం ఒక 70 గ్రామ్ లు తీసుకున్న తొందరగా పెరుగుతారు, ఇందులో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ చాలా ఉంటాయి.

4) అరటిపండు : అరటి పండులో చాలా మంచి ఆరోగ్య పోషకాలు ఉంటాయి. అలాగే సన్నగా ఉన్నవారు లావుగా అవ్వడానికి అరపండు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎత్తు పెరగటంలో, శిరోజాలు ఊడిపోవడం తగ్గిస్తుంది.

5) ఎర్ర ముల్లంగి : ఎర్ర ముల్లంగి ఎత్తు పెరగటంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో ఉండే అనేక పదార్థాలు ఎత్తు పెరగటంలో సహాయపడుతాయి.

6) బచ్చలి కూర : మానవ శరీరానికి ఆకు కూరలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. బచ్చలి కూర ఆరోగ్యం తో పాటు మనకు ఎత్తు ను కూడా ఇస్తుంది అందుకు కారణం ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉండటమే

7) బీన్స్ : బీన్స్ లో ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదర్థాలు ఉంటాయి అవి ఎత్తు పెరగటంలో సహాయపడుతాయి.

8) బెండకాయ : దీనిలో విటవిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎత్తు పెరగటంలో ఉపయోగపడుతాయి.

(Visited 582 times, 1 visits today)