Home / Inspiring Stories / ఫ్రాన్స్ పతాకం లా వెలిగిన ప్రపంచ దేశాలు.

ఫ్రాన్స్ పతాకం లా వెలిగిన ప్రపంచ దేశాలు.

Author:

paris

ప్రశాంత నగరం ఒక్క సారిగా నెత్తురోడింది ప్రభుత్వాలకూ ఉగ్రవాదులకూ మధ్య ఎప్పటిలాగానే సామాన్యుడే నలిగిపోయాడు. సిరియా, గాజా, ముంబై, కాబూల్,న్యూయార్క్ దేశమేదైనా మరణాలు మాత్రం అంతర్జాతీయ రాజకీయాలతో ఏమాత్రం సంభందం లేని మామూలు జనాలదే… మరోసారి బుల్లెట్లు రక్రం లో తడిసాయ్..ఇంకోసారి ఉగ్రవాదం ముసుగులో సామ్రాజ్యవాద దేశాల అక్రమ సంతానం దాడులకు తెగ బడింది ఈ సారి మృత్యు నగరం పేరు ప్యారిస్…

Paris 2

చావు కేకలతో,ప్రాణభయం తో బిక్కు బిక్కుమన్న నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్యారిస్ కి ప్రపంచ దేశాల సానుభూతి, సంఘీభావాని తెలుపుతున్నాయి.ఫ్రాన్స్ తో పాటు ప్రపంచదేశాలను నివ్వెరపరిచిన టెర్రర్ దాడుల నేపథ్యంలో పారిస్ లో నిర్వహించాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్లను రద్దు చేశారు.

Paris 4

షెడ్యూల్ ప్రకారం ఫ్రాన్స్ ఎలైట్ లీగ్ లో ఈ వారం ఇక్కడ నిర్వహించాల్సిన మ్యాచ్ లేవీ లేవు. అయితే, ఇంగ్లండ్ జట్టుతో మాత్రం లండన్ లో ఓ స్నేహ పూర్వక ఫుట్ బాల్ మ్యాచ్ మాత్రం జరుగనుంది. పారిస్ లోని సెయింట్ డెనిస్ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగిన సమయంలో స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో ఫ్రాన్స్ సాకర్ జట్టు జర్మనీతో మ్యాచ్ ఆడుతోంది. ఇక, ఫ్రాన్స్ లో నిర్వహించాల్సిన చాంపియన్స్ కప్, చాలెంజ్ కప్ రగ్బీ పోటీలను రద్దు చేస్తున్నట్టు యూరోపియన్ ప్రొఫెషనల్ రగ్బీ సంఘం తెలిపింది.

Paris 3

బాస్కెట్ బాల్, వాలీబాల్ సంఘాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. కాగా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పారిస్ వాసులకు సంఘీభావం ప్రకటించింది. పారిస్ ఉగ్రవాద దాడిపై అంతర్జాతీయ సమాజం ఏకమైంది. పారిస్ కు అన్ని విధాలా సహకరిస్తామని దేశాల అధ్యక్షులు ప్రధానులు ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు టర్కీ పర్యటనను రద్దుచేసుకున్నారు. జర్మనీ ఛాన్స్ లర్ మార్గరేట్ ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడారు. లండన్ లో ఉన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ దాడులు తమను దిగ్భ్రాంతిని గురి చేశాయన్నారు. కష్టకాలంలో తాము ఫ్రాన్సు దేశానికి అండగా ఉంటామని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు సాగించిన నరమేధాన్ని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఫ్రాన్స్ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.. ఆయా దేశాలు ఫ్రాన్స్ తో తమ సంఘీ భావాన్ని తెలుపుతూ తమతమ దేశాల్లోని ప్రముఖ కట్టడాలను ఫ్రాస్ దేశ పతాక రనులతో కనిపించేలా చేసి తామూ ఉగ్రవాదం పై పోరులో ఫ్రాన్స్ వైపే అని చెప్పారు…

Paris 1

(Visited 101 times, 1 visits today)