Home / Inspiring Stories / హైదరాబాద్ లో ఉచితంగా షాపింగ్ – గుడ్ విల్ స్టోర్

హైదరాబాద్ లో ఉచితంగా షాపింగ్ – గుడ్ విల్ స్టోర్

Author:

50% డిస్కౌంట్ అంటేనే షాపింగ్ మాల్స్ ముందు బారులు తీసి షాపింగ్ చేసే హైదరాబాద్ నగరవాసులు, ఉచిత షాపింగ్ హైదరాబాద్ లోనే అంటే ఎంతలా ఆశ్చర్య పోతారో చెప్పనవసరం లేదు. అవునండి… మన హైదరాబాద్ లోనే ఉచితంగా బట్టలు, చెప్పులు మరియు ఇతర వస్తువులు తీసుకోవచ్చు. అదెక్కడో కాదు, అందరికి సుపరిచమైన మెహదీపట్నం ప్రాంతంలోనే…

goodwill store hyderabad

హైదరాబాద్ లోని మెహదీపట్నంలో ‘గుడ్ విల్ స్టోర్’ అనే పేరుతో ఓ స్వచ్చంధ సేవ స్టోర్ ఉంది. 2015 అక్టోబర్ లో ప్రారంభమైన ఈ స్టోర్ లో ఆనాధలు, పేదలకు బట్టలు, చెప్పులు సహా ఇతర వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దాతల ద్వారా సేకరించే వీటిని ఒక్కరికి గరిష్టంగా 3జతల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. కాగా, మూడు నెలల తర్వాత పాత బట్టలు ఇచ్చేసి మళ్ళీ కొత్త బట్టలు షాపింగ్ చేసే వెసులుబాటు కూడా వీరు అందిస్తున్నారు. వారంలో ప్రతి గురు, శని వారాల్లో తెరిచి ఉంటుందని ఈ స్టోర్ మేనేజర్ అయినా రవీందర్ తెలిపారు. ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తున్న ఈ స్టోర్ ఆలోచన వెనక ఉన్నవారికి హ్యాట్సాఫ్.

For more information check their website: http://lsnfoundation.org/

Address of Good Will Store: D No 12-2-790/67/3
Aditya Apartments
Ayodhya Nagr colony, Mehdipatnam
Hyderabad, Telangana-500028

(Visited 1,787 times, 1 visits today)