Home / Inspiring Stories / హైదరాబాద్ వాసులకు శుభవార్త …ఇక నగరమంతా ఉచిత వైఫై

హైదరాబాద్ వాసులకు శుభవార్త …ఇక నగరమంతా ఉచిత వైఫై

Author:

హైదరాబాద్ వాసులకు శుభవార్త దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై నగరంగా హైదరాబాద్ మారనుంది. హైదరాబాద్ వ్యాప్తంగా వైఫై సేవలను అందించటానికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ ఎల్ ప్రణాళికలకు సిద్ధం చేస్తుంది. నగరం అంత దాదాపు 150 వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం క్వాడ్జన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నగరంలో ఇప్పటికే 49 హాట్ స్పాట్స్ ఏర్పాటు చేసి వైఫై సేవలు అందిస్తుంది. ఈ పక్రియను మరింత విస్తరించేందుకు స్మాల్ , మీడియం,లార్జ్ హాట్ స్పాట్స్ ఏర్పాటు చేయనున్నారు.

free_wifi_in_hyderabad

ఈ విధానంలో ఒక్కో హాట్ స్పాట్ కి ఐదు వైఫై టవర్లు ఏర్పాటు చేసి, ఈ టవర్ నుండి ఐదు కి.మీ పరిధిలో సేవలు అందించేలా తీర్చిదిద్దనున్నారు. వినియోగదారులు 2 నుండి 10 ఎంబీల వరకు స్పీడ్ తో ఇంటర్నెట్ ని పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఉచితంగా వైఫై ని వినియోగించుకోవచ్చు (పరిమితి కి తగ్గట్లు). ఇతర నెట్ వర్క్ వినియోగదారులు తొలి 15 నిముషాలు ఉచిత వైఫై ని వినియోగించుకోవచ్చు. వైఫై అలానే కొనసాగించాలి అనుకుంటే మాత్రం వోచర్లు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లను ఉపయోగించి సేవలు పొందవచ్చు. ఈ విధానం వచ్చే ఏడాది మార్చి నుండి అందుబాటులోకి రానున్నట్లు బీఎస్ఎన్ ఎల్ ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ రాంచంద్ తెలిపారు.

(Visited 846 times, 1 visits today)