Home / Inspiring Stories / ఢిల్లిలో ఫ్రెంచ్ సైనిక బలగాలు… ఏం జరుగుతోంది..?

ఢిల్లిలో ఫ్రెంచ్ సైనిక బలగాలు… ఏం జరుగుతోంది..?

Author:

ఈసారి జరిగే భారత గణతంత్ర వేడుకలకు ఒక ప్రత్యేకత తోడవ్వనుంది. చరిత్రలోనే తొలిసారిగా విదేశీ సైన్యం పాల్గొని భారత దేశ పతాకంతో పరేడ్ నిర్వహించనుంది. అంతేకాదు కవాతులో పాల్గొనే త్రివిధ దళాల బృందాలను తగ్గించడంతో పాటు పరేడ్ నిడివిని కూడా భారీగా తగ్గించారు.

French Soldiers Will March With Indians On Republic Day

ఈసారి గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగే ఎర్రకోట పరేడ్‌లో ఫ్రాన్స్ దేశం కూడా పాలుపంచుకోనుంది. ఫ్రెంచ్ సైనిక దళం భారత సైన్యంతో కలిసి పెరేడ్ లో పాల్గొననుంది. ఇందు కోసం ఫ్రెంచ్ సైన్యం ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. 14 జూలై, 1789న ఫ్రెంచ్ విప్లవానికి నాందీ అయిన బాసిల్స్ కోట ధ్వంసాన్ని పురస్కరించుకుని, 2009లో ఫ్రాన్స్‌లో జరిగిన వేడుకల్లో భారత్ అతి పురాతన రెజిమెంట్ అయిన “మరాఠాలైట్” దళం పాల్గొంది. పారిస్‌లోని ప్రాఖ్యాత చాంప్స్ ఎల్సీ వద్ద ఫ్రెంచ్ సైన్యంతో కలిసి భారత్ దళం పరేడ్ చేసింది. ఆ వేడుకల్లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

French Soldiers Will March With Indians On Republic Day

కాగా భారత రిపబ్లిక్ పరేడ్‌లో ఫ్రెంచ్ ప్రతినిధి పాల్గొనడం ఇది ఐదోసారి. ప్రపంచంలో ఏ దేశ ప్రతినిధి కూడా మరోదెశపు అధికారిక వేడుకల్లో ఇన్నిసార్లు పాల్గొనలేదు. రక్షణ, శక్తి, అంతరిక్షం, వాణిజ్యం వంటి రంగాల్లో భారత్-ఫ్రాన్స్‌లు బలమైన సంబంధాలను కలిగిఉన్నాయి. భారత్‌లో రక్షణ, శాస్త్ర సాంకేతిక, మౌలిక వసతుల రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. వివిధ రంగాల్లో దాదాపు రూ.13,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరింది. భారత వైమానిక దళం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 రఫాలే యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు భార్త దేశం ఒప్పందం చేసుకుంది కూడా.ఇక ఉగ్రవాదం విషయం లోనూ భారత దేశం ఫ్రాన్స్ తో కలిసి పోరాటాం చేయనున్నట్టు భారత ప్రధాని మోడీ ప్రకటించిన విషయమూ తెలిసిందే..

(Visited 516 times, 1 visits today)