Home / Entertainment / ఇక రోజుకి ఐదు ఆటలు

ఇక రోజుకి ఐదు ఆటలు

Author:

now onwards 5 shows in tollywood

ప్రస్తుతం చిన్న సినిమాలను పట్టించుకున్న నాదుడే లేడు, ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ఆడిస్తున్నారు, ఒక వేలా చిన్న సినిమాకు కొన్ని థియేటర్స్ దొరికిన ఆ తర్వాత వారం సినిమా బాగున్నా.. దాన్ని తీసివేయావల్సిన పరిస్థితి. ఎందుకంటే మన పరిశ్రమలో కొందరి డామినేషన్ ఉందన్నసంగతి మనకు తెలిసిందే. కానీ ఇక పప్పులు ఉడుకవు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలోనాలుగు ప్రదర్శనలకు బదులుగా ఇకపై ఐదు ప్రదర్శనలకు పెంచడం జరిగింది. అయితే ఈ ఐదో ఆట ఖచ్చితంగా చిన్న సినిమా అయుండాలని తెలంగాణ సబ్ కమిటి సోమవారం సూచించింది. అలాగే చిన్న సినిమాల పరిమితి 30 నుంచి 50 థియేటర్లకు పెంచుతూ… సబ్ కమిటి నిర్ణయం తీసుకుంది.

        ఇక సినీ కార్మికుల నివాసాల కోసం చిత్రపురిలో 9 ఎకరాలు కేటాయింపుతో పాటు హైదరాబాద్ టీవీ అండ్ ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సబ్ కమిటి ఆమోదం తెలిపింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై సబ్ కమిటి సోమవారం సమావేశం అయింది. సినీరంగం నుంచి ఈ భేటికి దాసరి నారాయణరావు, దగ్గుబాటి సురేష్, మురళి మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ్, శంకర్ తదితరలు హాజరయ్యారు.

(Visited 232 times, 1 visits today)