Home / Latest Alajadi / మీరు పానీపూరి తింటున్నారా..?అయితే ఈ నిజం తెలుసుకోవాల్సిందే..!

మీరు పానీపూరి తింటున్నారా..?అయితే ఈ నిజం తెలుసుకోవాల్సిందే..!

Author:

పానీ పూరిని చూడగానే నోట్లో లాలాజలం వస్తుంది. పానీ పూరీని చాలా మంది ఇష్టంగా తింటారు. మీకు మీ ఆరోగ్యం కావాలి అంటే ఆ ఇష్టమని వదిలి వేయాలి. రోడ్ పక్కన దొరికే పానీ పూరి, ఆహార పదార్థాలు, జ్యూస్ లలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్టు గాంధీ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్( సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్) తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. మురుగు నాలాల పక్కన ఉండే బండ్ల దగ్గర కొంటున్న ఆహార పదార్థాలలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. వైద్య విద్యార్థులు నగరంలో వివిధ ప్రాంతాల్లో సేకరించి, వాటిని ల్యాబ్ లో పరీక్షించారు. నాలాలకు 2 మీటర్ల దూరంలో ఉన్న బండ్ల నుండి సేకరించిన పానీ పూరి ఇతర ఆహార పదార్థాలలో 48.2% కలుషిత బ్యాక్టీరియా, నాలాల నుండి 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న బండ్లపై సేకరించిన శాంపిళ్లలో 28.6% కలుషిత బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్న పదార్థాలను తినడం వలన ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వైద్యులు తెలియజేసారు. శుభ్రం పాటించే బండ్ల దగ్గర సేకరించిన శాంపిళ్లలో కలుషితాలు తక్కువగా ఉన్నాయి. నాలాల దగ్గర రోడ్ కు ఇరువైపులా తోపుడు బండ్లు పెట్టుకునేవారు బండి పక్కనే చెత్త బుట్టను పెడుతారు. ఇందులొంచి చెడు బ్యాక్టీరియా తిరిగి ఆహారపదార్థాలపై చేరుతున్నాయి. ఫ్లేట్ల సంగతి చెప్పనక్కరలేదు వాటిని ఒకే వాటర్ లో చాలా సార్లు కడుగుతుంటారు. ఫ్లేట్లు శుభ్రంగా చేయకపోవడం వలన 60% శాంపిళ్లలో ఫంగల్ ఇన్ ఫెక్షన్లు ఉన్నట్టు గుర్తించారు.

panupuri-side-effects

ఎలాంటి ఆహారపదార్థాలలో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది :
నగర ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీపూరి, పండ్ల రసాలు, సమోసాల శాంపిళ్లు తీసుకోని పరీక్షించారు. సమోసాలు ఎక్కువగా వేడిగానే ఇస్తుండటంతో వాటిలో ఎలాంటి బ్యాక్టీరియా ఉండటంలేదు అని తేలింది. మిగతా ఆహార పదార్థాలలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని ఎపిఎం విభాగం అధిపతి విమలథామస్, అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్మయి, విద్యార్థులు శివకామేష్, హారిక, సాయిదివిజా, ప్రేరణ, సాయిదాసర తెలిపారు. ఈ పరీక్షకు జంట నగరాలలో 80 ప్రాంతాలలో ఐదు నెలలపాటు పర్యటించి నమూనాలను సేకరించారు. ఇందులో సమోసా మినహా మిగతా వాటిలో దాదాపు 54% శాంపిళ్లు రోగాలకు కారణం ఇవే అని గుర్తించారు. వీటిలో ఈకోలీ, సాల్మొనెలా అనే బ్యాక్టీరియా అంచనాలకు మించి ఉన్నట్టు తేలింది. వీటి వలన నీళ్ల విరోచనాలు, వాంతులు వచ్చే ప్రమాదముంది. సాల్మొనెల్లాతో టైపాయిడ్ జ్వరం వస్తుంది.

అపరిశుభ్రత వలన :

  • సర్వేలో భాగంగా శాంపిళ్లు సేకరిస్తున్న సమయంలో వారి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న తీరు, పక్కన పేరుకుపోయిన అపరిశుభ్రతని విద్యార్థులు పరిగణలోకి తీసుకున్నారు.
  • ప్రధానంగా ఫ్లేట్లు, గ్లాసులను కడిగే క్రమంలో అవన్నీ ఒకే టబ్బులో వేసి అందులో ఉన్న నీటితోనే కడగటం, లేదా ప్రత్యేకమైన టాప్ ద్వారా కడగటాన్ని పరిశీలించారు.
  • నల్ల కింద కడిగిన ఫ్లేట్లలో కంటే టబ్బులో కడిగిన ఫ్లేట్లలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది. ఫ్లేట్లు కడిగే ప్రాంతాన్ని తినే చోటుకు ఉన్న దూరాన్ని అలాగే వ్యాపించే బ్యాక్టీరియాను సేకరించి పరీక్షలకు పంపించారు.
  • చేతులకు గ్లౌజులు ధరించి పదార్థాలను అందిస్తున్న బండ్ల దగ్గర అంతగా బ్యాక్టీరియా లేనట్టు తెలిసింది.

అధ్యయనంలో ముఖ్యంశాలు :

  • అధ్యయనం జరిగిన ప్రాంతాలు : హైదరాబాద్, సికింద్రాబాద్
  • సేకరించిన నమూనాలు : 80-100
  • నమూనాల పేర్లు : పానీ పూరి, చట్నీస్, సమోసా, పండ్ల రసాలు.
  • కనిపించిన బ్యాక్టీరియా : ఈ-కోలి, సాల్మానేల్లా.
  • కలుషితమైన శాంపిళ్లు : 54%.
  • మురుగు కాల్వకు పక్కనే ఉన్న వాటిలో : 48.2%.
  • 2 మీటర్ల కంటే దూరంగా ఉన్నవాటిలో : 28.6%.
  • ఈకోలి ఉన్న శాంపిళ్లు : 78.6%.
  • ఫంగస్ ఉన్నవి : 60%.

ఇలాంటి చిన్న చిన్న విషయాలని పట్టించుకోకపోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్ , రక్త కణాలు తగ్గిపోవడం లాంటి రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటినుండి బయట తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

(Visited 4,228 times, 1 visits today)