Home / Political / వినాయకుని విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దు.

వినాయకుని విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దు.

Author:

వినాయక చవితి వస్తుంది అంటే చాలు మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతలలో వినాయక విగ్రహాల కోలహలం మొదలవుతుంది. పక్క వారి కన్న ఎత్తైన విగ్రహం పెట్టాలని పొటీలు పడి మరీ లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టి వినాయక చవితి ని నిర్వహిస్తారు. కాని కొన్ని సంవత్సరాలుగా పర్యవరణ పరిరక్షన, నీటి కాలుష్యం, మట్టి వినాయకుల విగ్రహాలపై ప్రజలకు కొంచెం అవగాహన పెరగడంతో పెద్ద పెద్ద విగ్రహాల పైన మోజు తగ్గింది. కాలుష్యం కారకాలు ఉన్న విగ్రహాలను హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో నిమర్జనం చెయ్యొద్దంటూ చాల కేసులు నమోదయ్యాయి. దీనిపై స్పందించిన హైకోర్టు విగ్రహాలలొ కేవలం సహజ రంగులను వాడాలని, విగ్రహాల ఎత్తు 15 అడుగులు మించొద్దని అదేశాలు జారి చేసింది.

vinayaka idol shouldn't be more than 15 feet high

తెలంగాణ ప్రభుత్వం కూడ మెట్రొ రైలు వంతెనలకు తాకకుండా ఉండేందుకు విగ్రహాలు 15 అడుగుల కన్న ఎక్కువ ఎత్తు పెట్ట వద్దని ఉత్సవ కమిటీలను కొరింది. కాని దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత 35 సంవత్సరాలలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం తమపై ఆంక్షలు విదించలేదని . ఈసారి కూడ పాత పద్దతిలొనే విగ్రహాలను పెడతామని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. దీనిపై మళ్ళీ స్పందించిన హైకోర్టు మరోసారి విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దని ఆదేశించింది. తమ గత తీర్పు అమలుకు ఎటువంటి చర్యలు తీసుకున్నరో చెప్పలంటు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ అభివ్రుద్ది, మెట్రొ రైలు పనులను ద్రుష్టిలో ఉంచుకొని అందరూ ఈ తీర్పును పాటించాలని ఆదేశించింది.

(Visited 739 times, 1 visits today)