Home / Inspiring Stories / గ్యాంగ్ రేప్ భయంతో కదిలే ట్రైన్ లోంచి దూకేసిన యువతి.

గ్యాంగ్ రేప్ భయంతో కదిలే ట్రైన్ లోంచి దూకేసిన యువతి.

Author:

భారతదేశంలో రోజు రోజుకీ స్త్రీల పరిస్థితి దిగాజారుతోంది ఎన్ని చట్టాలు వచ్చినా ఏమాత్రం మార్పులేదు. రోజుకో పాశవికదాడి వార్త బయటికి వస్తూనే ఉంది. రక్షణ వ్యవస్తని పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం మాత్రం “ఇండియన్ డాటర్”వంటి డాక్యు మెంటరీలని బయటికి రాకుండా అడ్డుకుంటోంది. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి మహానుభావులే “రేపులని ఎవరూ ఆపలేరు” కుర్రాళ్ళన్నాక రేప్ చేయకుండా ఉంటారా” అనే వ్యాఖ్యలు చేయటం మరీ ధారుణంగా మారిన స్థితిని బహిరంగంగానే చూపిస్తోంది. అత్యధికంగా స్త్రీల పై దాడుల ఘటనలు యూపీ, బీహార్ ల నుంచే ఉండగా మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. 25 ఏళ్ళ మహిళ గ్యాంగ్ రేప్ భయంతో కదిలే ట్రైన్ నుంచి దూకేసిన సంఘటన అందరినీ కలిచి వేసింది.

రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఒక జంట గజియాబాద్ నుంచి దిహంతా వెళ్ళేందుకు తమ కుమారుడితో సహా మహానంద ఎక్స్ ప్రెస్  జనరల్ కంపార్ట్ మెంట్ లో ఎక్కారు. అదే కోచ్ లో సిలిగురిలో ఎక్కిన మరికొందరు యువకులు ఈ దంపతులతో వాగ్వాదానికి దిగి ఆ యువతి పై అనుచిత వ్యాఖ్యలు చేయటం తో పాటు వారిపై దాడికి దిగారు. ఆమె పై లైంగిక దాడికి ప్రయత్నించటంతో ఆ దంపతులు భయంతో కదులుతున్న   ట్రైన్ లోనుంచి దూకేసారు. యువతి స్వల్ప గాయాలతో తప్పించుకోగా వారి కుమారుడూ ఆమె భర్త తలలకు తీవ్ర గాయాలతోపాటూ పలు ఫ్రాక్చర్లు కూడా అయ్యాయని రైల్వే డాక్టర్లు తెలిపారు..

డిప్యూటీ కమర్షియల్ మేనేజర్, ఆలీపూర్దూర్(NFR) బసంత దాస్ ఈ ఘటన పై మాట్లాడుతూ తమకు సమాచారం అందే లోపే నిందితులు పారిపోయారనీ. వారిని పట్టుకోవటానికి రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. ఎన్నొ సంఘటనలు రైళ్ళలో చోటు చేసుకుంటున్నా జనరల్ కోచ్ లలో భద్రత సరైన పద్దతిలో లేదని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. నిజానికి కదిలే రైళ్లలో జరిగే నేరాలు బెంగాల్ కి కొత్త కాదు ఐనా అధికారుల అలసత్వం మరిన్ని నేరాలకు ఊతమిస్తూనే ఉంది.

(Visited 123 times, 1 visits today)