Home / Entertainment / ఇప్పుడైన “గరం” చూపిస్తాడా?

ఇప్పుడైన “గరం” చూపిస్తాడా?

Author:

GARAM movie poster

ఆది, నటుడు సాయికుమార్ తనయుడిగా వెండితెరకి పరిచయమై, తన మొదటి సినిమా ‘ప్రేమ కావాలి’ అంటూ తన నటనతో అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నాడు.  ఆ చిత్రం తర్వాత, ప్యార్ మే పడిపోయానే, గాలిపటం, రఫ్ వంటి సినిమాలు చేశాడు కాని మనోడికి అదృష్టం కలసిరాలేదు. సరైన హిట్ లేక ప్రేక్షకుల ఆదరణ కూడా కరువైంది. ఈ మద్యా పెళ్ళి చేసుకోని సోంతంగ ఆర్కే బ్యానర్ పెట్టి మరి “గరం”  సినిమా చేస్తుండు. ఇప్పుడు ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ విడుదల చేసారు.

GARAM movie poster

ఆది, ఆదాశర్మ నటిస్తున్న ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తుండగా, మదన్ అసిస్టెంట్ శ్రీనివాసు కథ ఇచ్చాడు.  తాజాగా ఈ చిత్రం యొక్క పోస్టర్ ని విడుదల చేసి అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాడు ఆది. దర్శకుడు మదన్ మాట్లాడుతూ మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించేలా ఎలా హీరో చేసుకుంటాడో అనేది ఈ చిత్ర కథ అని, ఈ చిత్రం కోసం ఆది చాలా కష్టపడ్డాడని తెలిపాడు. హీరో ఆది మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎంత కష్టపడ్డామో ఒక నిర్మాతగా నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది. అమ్మ, నాన్న, మా ఆంటీలు సినిమా రూపొందించడానికి చాలా సహాయం చేసారని తెలిపాడు.

(Visited 90 times, 1 visits today)