Home / Entertainment / ‘గరుడ’ లో కాలయవనుడికి, గరుత్మంతుడికి మధ్య ‘భీకర పోరు’ సన్నివేశాలు !

‘గరుడ’ లో కాలయవనుడికి, గరుత్మంతుడికి మధ్య ‘భీకర పోరు’ సన్నివేశాలు !

Author:

రామాయణానికి, మహా భారతానికి, కాలయవనుడనే రాక్షసుడుకి, బాహుబలి లో విలన్ కాలకేయుడికి ఉన్న లింక్  మొత్తానికి ఎస్టాబ్లిష్ అయింది. ఆ లింకే ఇప్పుడు `గరుడ’ కి కొనసాగింపు కాబోతోంది. గరుడ సినిమాలో కూడా కాలయవనుడి వారసుల ప్రస్తావన కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. స్కంద పురాణం ప్రకారం అనంతగిరి  దేవాలయాన్ని ద్వాపర యుగంలో మార్కండేయ మహర్షి నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండలలో యోగ సాధన చేయటానికి సంకల్పిస్తాడు . ప్రతి రోజూ మార్కండేయ ముని తన యోగ సాధనతో అనంతగిరి నుండి కాశీ వెళ్ళిగంగా నది లో పవిత్ర స్నానమాచరించేవాడు. ఒక రోజు ఉదయం ప్రాతః కాలంలో ద్వాదశి ప్రవేశించటం వల్ల ఆయన కాశీ కి వెళ్లలేకపోతాడు. శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలంతో స్నానమాచరించటానికి ఏర్పాట్లు చేస్తాడు.

ఇంకొక కథనం ప్రకారం రాజర్షి ముచికుందుడు అనేక సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అనంతగిరిలో విశ్రాంతి తీసుకోవటానికి వచ్చి పూర్తి నిద్రలోనికి వెళ్తాడు. తనకు ఎవరు  నిద్రాభంగం కలిగిస్తారో వారు అగ్నికి ఆహుతి అవుతారు అనే వరాన్ని ఆయనకు ఇంద్రుడు ప్రసాదిస్తాడు.

ఇహ మరో పురాణ కథ ప్రకారం కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకా నగరాన్ని చేరుకుని కృష్ణుడు మరియు బలరాములను తీసుకుని అనంతగిరి ప్రాంతానికి వచ్చి ముచికుందుని నిద్రాభంగం కలిగించి ఆయన మరణిస్తాడు. కృష్ణుడు ముచికుందునకు అనంత పద్మనాభస్వామి రూపంలో దర్శనమిస్తాడు. ముచికుందునికి శాశ్వత స్థానం కల్పించటానికి ఒక నది రూపం అనుగ్రహిస్తాడు. అదే నది ప్రస్తుతం మూసీ నదిగా పిలువబడుతోంది. ఇప్పుడు ఈ రెండు పురాణ కథలలో ఉన్న పాత్రలకు ..’గరుడ’ స్క్రిప్ట్ ని లింక్ చేస్తూ కథ రూపొందుతున్నట్టు ఫిల్మ్ నగర్ బాబులు చెపుతున్నారు. కాలయవనుడు అనే రాక్షసుడు శ్రీకృష్ణుడిని వెంటాడుతూ వచ్చే సన్నివేశాల కోసం అనంతగిరి లొకేషన్ షూటింగ్ కి అనుకూలమని కథా పరంగా స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ అయిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను ఉటంకిస్తూ వార్తలు బయటకు పొక్కుతున్నాయి. అంతా ఒకే అయితే, ‘గరుడ’ ముహూర్తం షాట్ లేదా క్లైమాక్స్ తెలంగాణా లోని అనంతగిరి హిల్స్ లో ఉండవచ్చునని అంటున్నారు. రామాయణ , మహాభారతాలలోని కొన్ని ఘట్టాలతో బాహుబలి చిత్రానికి ఉన్న కొన్ని పోలికలను ఇక్కడ గమనిస్తే, రాజమౌళి టీం ఎంత క్లోజ్ గా ఈ రెండు ఎపిక్స్ ను ఫాలో అయ్యిందో అర్ధమవుతుంది.

శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు..బాలకృష్ణుడి ని యమునా దాటించటం.

శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు bahubali

శ్రీ కృష్ణుడు చెరసాలలో జన్మించినపుడు, అతనికి తన మేన మామయిన కంసుని వల్ల  ముప్పు ఉన్నందున, గోకులంలో వున్న యశోద వద్దకు చేర్చటానికి, వసుదేవుడు మథుర నుండి యమునా నది గుండా గోకులంలో ఉన్న నందుడు అనే మహారాజు వద్దకు తీసుకెళ్తాడు.

బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలిని, బల్లాలదేవ బారి నుంచి రక్షించటానికి  శివగామి ఒక సొరంగం ద్వారా నది దాటుతుంది. ఆ తర్వాత ఆ పసివాడిని అక్కడ గ్రామస్తులు రక్షించి ‘సంగ’ అనే మహిళకు అప్పచెపితే,  ‘శివ’ అనే పేరుతో అతడిని పెంచి పెద్దవాడిని చేస్తుంది.

హనుమంతుడు సీత దేవి కాపాడుతానని చెప్పటం..

bahubali kattappa ..బాలకృష్ణుడి ని యమునా దాటించటం.

 

అశోకవనంలో రావణుని చెరలో వున్న సీత దేవి వద్దకు హనుమంతుడు వచ్చి నమస్కరించి సీతను రక్షించటానికి ఆజ్ఞ కోరుతాడు. సీత దేవి తిరస్కరించి, తన  భర్త శ్రీ రామచంద్రుడు వచ్చి ఈ చెడ్డ మనస్కుడైన రావణున్ని సంహరించిన తర్వాతే ఇక్కడి నుండి వస్తానని చెబుతుంది.

బాహుబలి చిత్రంలో బల్లాలదేవా బారి నుంచి దేవసేనను రక్షిస్తానని,అందుకు అంగీకరించాలని ప్రార్థించిన కట్టప్పతో దేవసేన తన కుమారుడు మహేంద్ర బాహుబలి వచ్చి బల్లాల దేవను శిక్షించిన తర్వాతే, ఇక్కడి నుండి వస్తానని అతని ప్రార్థనను తిరస్కరిస్తుంది.

అశోకవనంలో రావణుడు సీతాదేవి తో మాట్లాడటం…

అశోకవనంలో రావణుడు సీతాదేవి తో మాట్లాడటం bahubali bhallala deva

అశోక వనంలో రావణుడు, సీత దేవి వద్దకు వచ్చి తనను వివాహం చేసుకొని లంకకు మహారాణి గా సుఖ జీవితం అనుభవించమని కోరినపుడు..సీత దేవి రావణుడి వంక చూడకుండా త్వరలోనే తన భర్త తప్పకుండ ఆక్కడికి వచ్చి తనను శిక్షిస్తాడని చెబుతుంది.

బాహుబలి చిత్రంలో మాహిష్మతి సామ్రాజ్యంలో బందీగా వున్న దేవసేనతో బల్లాలదేవా, అమరేంద్ర బాహుబలిని తన భర్తగా నిరాకరించమని కోరుతాడు. ఆ తర్వాత కట్టప్ప తో దేవసేన ఇలా అంటుంది..నా కొడుకు వస్తాడు వచ్చి నేను పెరుస్తున్న చితి వద్దకు బల్లాలదేవను ఈడ్చుకెళ్లి మసి చేసి మరి తనను రక్షిస్తాడని చెబుతుంది.

హనుమంతుడు లంకకి నిప్పు పెట్టటం..

హనుమంతుడు లంకకి నిప్పు పెట్టటం.. bahubali

 

సీతాదేవిని రక్షించటానికి వచ్చిన హనుమంతుడు, సీతాదేవి కనబడగానే..రావణుడికి బుద్ది చెప్పటంకోసం లంకకి నిప్పు పెడతాడు. ఆ సమయంలోనే రావణుడి కుమారుడైన అక్షయ కుమారుడిని సంహరిస్తాడు.

బాహుబలి చిత్రంలో దేవసేనను రక్షించటానికి వచ్చిన మహేంద్ర బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యంలోని రాజభవనంలో నిప్పు పెట్టి, ఆ తర్వాత బల్లాలదేవా కొడుకుని చంపేస్తాడు.

మథుర పై దండెత్తిన కాలయవనుడు..

మథుర పై దండెత్తిన కాలయవనుడు bahubali

మహాభారతంలో కాలయవనుడు మూడు కోట్లమంది సైన్యంతో మథురపై దండెత్తుతాడు. ఆ సమయంలో ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుతూ, కనీస యుద్ధ నియమాలు లేకుండా కలయవనుడి సైన్యం ఎక్కడికక్కడ విద్వంసం సృష్టిస్తారు.

బాహుబలి చిత్రంలో కాలకేయుడు తన సైన్యంతో మాహిష్మతి సామ్రాజ్యం పై దండెత్తుతాడు. ఆ సమయంలో ఎవరికీ అర్థంకాని భాషలో మాట్లాడుతూ, కనీస యుద్ధ ధర్మాన్ని పాటించకుండా విద్వంసం సృష్టించటానికి ప్రయత్నిస్తాడు.

ఇది అచ్చం బలి చక్రవర్తి తల పై మోపిన వామనుడి సన్నివేశాన్ని గుర్తుకు తెస్తుంది.

మథుర పై దండెత్తిన కాలయవనుడు bahubali

బాహుబలి చిత్రంలో యువరాజుని చంపింది అమరేంద్రబాహుబలి కుమారుడైన మహేంద్రబాహుబలి అని తెలిసి యుద్ధ బానిసైన కట్టప్ప అతని ముందు లొంగిపోతూ మహేంద్ర బాహుబలి పాదాన్ని తన నుదిటి పై పెట్టుకుంటాడు. ఈ సన్నివేశం మన పురాణాల్లో వున్న బలి చక్రవర్తి-వామనుడి కథను గుర్తుకు తెస్తుంది.

KALA YAMA

కథా పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇతిహాసాలనుంచే రాజమౌళి స్ఫూర్తి తీసుకున్నారనటానికి పైన చెప్పిన ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఇప్పుడు రాబోయే ‘గరుడ’ లో కూడా కాలయవనుడికి, గరుత్మంతుడి కి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలకోసం నట సార్వభౌమ ఎస్ వీ రంగారావు నటించిన కొన్ని పాత పౌరాణిక చిత్రాల సన్నివేశాలను దగ్గర నుంచి గమనించి నోట్స్ ప్రిపేర్ చేసే బాధ్యతను ఆసిస్టంట్ డైరెక్టర్స్ టీం కు అప్ప చెప్పినట్టు తెలుస్తోంది.

(Visited 779 times, 1 visits today)