Home / Entertainment / నందమూరి బాలకృష్ణ 100 వ చిత్ర పాటల వేడుక వివరాలు…

నందమూరి బాలకృష్ణ 100 వ చిత్ర పాటల వేడుక వివరాలు…

Author:

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారి ప్రతిష్టాతకమైన 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. తెరకెక్కుతుంది. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. ఈ చిత్ర పాటల వేడుకను తిరుపతిలోని జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఈ నెల 26 తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తుండగా, దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

676b48dae5a3e4d368e397221b358018abc66d2d0ce04fd841pimgpsh_fullsize_distr

ఈ వేడుకకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మహా పలువురు ప్రముఖులు హాజరవనున్నారట. ఈ చిత్రానికి మాటలు సాయి మాధవ్ బుర్ర అందిస్తున్నారు. బాలకృష్ణ సరసన శ్రియ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, హేమమాలిని బాలకృష్ణకు తల్లిగా నటించనుంది. ఒక ప్రధాన పాత్రలో కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది, సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

(Visited 178 times, 1 visits today)