Home / Entertainment / గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్.

గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్.

Author:

నందమూరి నట సిమ్హం బాలయ్య బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. ఇలాంటి సినిమా కోసం చాలా రోజులు ఎదురుచూసిన బాలయ్య క్రిష్ చెప్పిన కథను నచ్చి పెద్ద పెద్ద దర్శకులను కాదని ఈ చిత్రాన్ని ఎంచుకున్నాడు. క్రిష్ కూడా తనకు అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అని సమాచారం. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టింది. ఇక ఈ సినిమా పాటలను చాలా గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది చిత్ర టీం…

gowthami-putra-satakarni-audio-release-date

ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అయిన అమరావతిలో చాలా గ్రాండ్ గా ప్రారంభం చేశారు. ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 16 న తిరుపతిలో గ్రాండ్ గా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ వేడుకకి సినీ, రాజకీయ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిదులుగా రానున్నారు.

(Visited 440 times, 1 visits today)