Home / Inspiring Stories / పధిహేనేళ్ల తరువాత స్వదేశానికి చేరిన గీత…..!

పధిహేనేళ్ల తరువాత స్వదేశానికి చేరిన గీత…..!

Author:

geeta-separated-at-7-in-pakistan-reunited-at-23-in-india

ఎట్టకేలకు పాకిస్తాన్ లో ఉన్న గీత తన మాతృ దేశానికి చేరుకుంది. సంజౌతా ఎక్స్‌ప్రెస్ లో పాకిస్తాన్ అధికారులకు దొరికినప్పుదు 7-8 ఏళ్ళ వయసున్న గీత ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత తన సొంత గడ్డ పై కాలు మోపింది. తనతో వచ్చిన ఈదీ ఫౌండేషన్ సబ్యులతో పాటు ఆమె భారత భూమి పై కాలు మోపింది. ఎలా వెళ్ళిందో ఏమోగానీ చిన్నరి గీత పాకిస్తాన్ లోకి ప్రవెశించి అక్కడి అధికారులకు దొరికింది. పుట్టు మూగ అయిన గీతని సాకటానికి ముందుకు వచ్చిన ఈదీ ఫౌండేషన్ గీతని ఈ పదమూడేళ్ళూ కడుపులో పెట్టుకుని చూసుకుంది.తర్వాత జరిగిన పరిణామాల రీత్యా గీత భారతీయురాలు అనీ ఆమెని మాతృ దేశానికి చేర్చాలనీ సోషల్ మీడియా లో ప్రచహారం మొదలయింది అది ప్రభుత్వాల వరకూ చేరటం తో. రెండు దేశాల ప్రభుత్వాలూ గీత పై దృష్టి పేట్టాయి. చివరికి గీత ఈ ఉదయం తన దేశానికి చేరుకుంది.

ఇదిలా వుంటే తాజాగా ఆమె తమ కూతురు అంటూ ఉత్తరప్రదేశ్,బీహార్ రాష్ట్రాలకు చెందిన రెండు కుటుంబాలు ముందుకు వచ్చాయి. ఆమె తమ కూతురేనంటూ వెల్లడించాయి. యూపీకి చెందిన రామరాజ్, అనారా దేవి మాట్లాడుతూ. 15 ఏళ్ల క్రితం సవిత(గీత) బీహారు లోని ఓ ఆశ్రమం నుంచి తప్పిపోయినట్లు వెల్లడించారు. తమ ఆరుగురి సంతానంలో గీత కూడా ఒకరనీ, తప్పిపోయినప్పుడు ఆమె వయసు 9 సంవత్సరాలు అంటూ  చెప్పుకొచ్చారు. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బొకారో నుంచి మరో జంట తమ నాల్గవ కుమార్తె కోకియా కుమారి(గీత) తప్పిపోయి పదేళ్ళు వుతుందని, ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో గీతగా టీవీల్లో చూపిస్తున్న ఆ అమ్మాయి తమ కుమార్తేనని చెప్పుకొచ్చారు.ఇల గీత తల్లి తండ్రులు ఎవరన్నాధి  పెద్ద చిక్కు సమస్యే అయింది ఐతే గీత భారత్ రాక గురించి విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ శుక్రవారం మీడియా కు తెలియ జేశారు తాము పంపిన ఫ్యామిలీ ఫొటోల్లో ఆమె తన తల్లి తండ్రులనూ,తన తోబుట్టువులనూ గుర్తు పట్టిందని, ప్రస్తుతం ఆ కుటుంబం బీహార్‌లో నివసిస్తోందని వికాస్ తెలిపారు. ఇప్పుడు గీత రాక తో ఆమె కుటుంబసభ్యులు గా చెప్పుకుంటున్న వారు కూడా ఎయిర్ పోర్ట్ కి వచ్చారు ఉదయం 10.40 గంటలకు ఢిల్లీ విమాశ్రయానికి చేరుకుంది. స్వదేశానికి చేరుకున్న గీతకు ఆనందోత్సాహాల నడుమ ఘనస్వాగతం లభించింది. గీత తల్లిదండ్రులు, బంధువులు విమానాశ్రయానికి తరలివచ్చారు. గీత రాక పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారుకానీ భారత దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు మాత్రం DNA టెస్టుల తరువాతనే వాటి ఫలితాలని అనుసరించి గీతని అప్పగిస్తామనీ చెప్పారు.

(Visited 41 times, 1 visits today)