సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి.సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో తీవ్రమైన వ్యతిరేకతని, నెగిటివ్ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన గీతా మాధురి తాజగా సీరియస్ అయ్యింది.
కొన్ని యూట్యూబ్ చానెళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. తప్పుడు వార్తలు ప్రెజెంట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లకి గీతామాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
నెగిటివ్ ప్రచారం మానండి అంటూ గీత మాధురి హెచ్చరించింది.. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందు ఆ వీడియోలను తీసివేయడానికి, సదరు యూట్యూబ్ ఛానెళ్లకి కొంత సమయం ఇస్తున్నానని పేర్కొన్నారు. ‘మహా అయితే ఓ రోజు బాధపడతానేమో తర్వాత సంతోషం, ప్రశాంతత నాదే’ అంటూ పోస్ట్ పెట్టారు. గీతా మాధురి వార్నింగ్ తో అయినా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఆగుతాయో లేదో చూడాలి.