Home / Entertainment / జెంటిల్ మెన్ సినిమా రివ్యూ & రేటింగ్.

జెంటిల్ మెన్ సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

gentleman-movie-review జెంటిల్ మెన్ రివ్యూ

భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీరి ప్రేమగాధ తో వరుస సూపర్ హిట్ ఇచ్చిన నాని ఇప్పుడు మన ముందుకు జెంటిల్ మెన్ గా వస్తున్నాడు. ఈ సినిమాని నానిని తెలుగు తెరకి పరిచయం చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా థామస్ నివేద, సురభి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈరోజు విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.

కథ :

జయరామ్ ముళ్లపూడి (నాని) చాలా చిన్న వయస్సులోనే మంచి బిజినెస్ మన్ మ్యాన్ గా పేరుతెచ్చుకుంటాడు. అలాగే ఆ సంవత్సరం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డ్ అందుకుంటాడు. జయరామ్ మంచి బిజినెస్ మన్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యాక్తిగా అందరి మనసుని దోచుకుంటాడు. ఇలాంటి పేరున్న వ్యాక్తిని తన ఇంటి అల్లుడిని చేసుకుంటే భాగుంటుందని ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్ అనుకుంటాడు. జై కి కూడా ఐశ్వర్య(సురభి) నచ్చడంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. ఐశ్వర్య తన పెళ్లికి ముందు తన ప్రెండ్స్ ని కలసి లండన్ నుండి తిరిగి వస్తుండగా ఫ్లైట్లో క్యాథరీన్ కలసి మంచి స్నేహితులు అవుతారు.

లండన్ నుండి వస్తున్నా ఐశ్వర్య ను రిసీవ్ చేసుకోవాడానికి వచ్చిన జై ని చూసి క్యాథరిన్ తన బాయ్ ప్రెండ్ గౌతమ్ కూడా అచ్చు జై లాగే ఉండేవాడని, తను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని చెపుతుంది. ఆ తర్వాత గౌతమ్ యాక్సిడెంట్ లో చనిపోలేదని ఎవరో కావాలనే చంపారని ఒక ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకొని ఆ హత్య మిస్టరీని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది క్యాథరిన్ మరి ఆ హత్య మిస్టరీని తెలుసుకుందా అనేది మిగిలిన కథ….

అలజడి విశ్లేషణ:

ఈ సినిమాలో కథ మాములుగానే ఉంది. ఇంక చెప్పాలంటే చాలా సినిమాలల్లో వచ్చిన కథనే. ఇద్దరు అన్నదమ్ముల్లు ఒకే విధంగా ఉండే పాత్ర. కానీ ఇందులో ఒక పాత్రకు ఒక పాత్రకు ఎవరికి ఎవరూ ఏమీకారు. ఒక సంపన్న కుంటుబం వ్యక్తిని ఎవరో హత్య చేస్తే అతని ప్లేస్ లో వచ్చి ఆ కుంటుంబానికి అండగా ఉంటాడు జై. ఈ సినిమాని ఇంద్రగంటి మోహనకృష్ణ తొలిసారిగా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించిన. ఫస్ట్ హాఫ్ అంతా తనకు బాగా పట్టున్న క్లాస్ ఫార్మాట్లో నడిపించిన సెకండ్ హాఫ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ పర్వాలేదు అన్నట్టు డీల్ చేశాడు.

జై పాత్రపై అనుమానం రావడం దాని తెలుసుకునేందుకు క్యాథరీన్ గౌతమ్ దగ్గర చేరడం, కొన్ని చిన్న ట్విస్ట్ లు చూపించడం అంటే ఈ సినిమాలో ఫస్ట్ ఆప్ కొద్దిగా హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ & కామెడీ ఉండటంతో పర్వాలేదు అనిపిస్తుంది. అదే సెకండాఫ్ కి వచ్చే వరకి మాత్రం చాలా స్లో గా స్టొరీ రన్ అవుతుంది. అలాగే కొన్ని సీన్స్ మనకు ముందే తెలిసిపోతాయి. దానితో సినిమా పై కిక్కు పోతుంది.

రెండు పాత్రల్లో నాని తన పరిది మేరకు భాగానే నటించాడు. అలాగే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ తన బాయ్ ఫ్రెండ్ ని  పొగొట్టుకొని, ఆ బాధలోనే అతని మరణం వెనక రహాస్యాన్ని ఛేదించే అమ్మాయిగా చాలా భాగా యాక్టింగ్ చేసింది. ఇక మరో హీరోయిన్ సురభి తన పాత్ర మేరకు పరువలేదు అనిపించింది. అవసరాల శ్రీనివాస్ రోటీన్ కు భిన్నంగా కొత్త తరహా పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రలలో రోహిణి, తనికెళ్ల భరణి, ఆనంద్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్ లు తమ పరిధి మేరకు పాత్రలకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమా కథ పాతదే అయిన తన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి మోహనకృష్ణ . అలాగే తన స్టైల్ ఆఫ్ మేకింగ్ బాగుంది.ఇక ఈ సినిమాకు చెప్పుకోవలసింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురుంచే, మణిశర్మ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు, కాని పాటలు మాత్రం నిరాశ పరిచాయి, అలాగే పిజి విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఇంకా బాగా చేస్తే సెకండ్ హాఫ్ లో సినిమా స్లో అవ్వకుండ ఉండేది

ప్లస్ పాయింట్స్:

  •  స్క్రీన్ ప్లే
  • నాని, నివేదా థామస్ ల నటన
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్:

  • స్టోరీ
  • సెకండాఫ్
  • పాటలు
  • ఎడిటింగ్

అలజడి రేటింగ్: 2.75/5

పంచ్ లైన్: జెంటిల్ గా ఒక్క సారి జెంటిల్ మెన్ ని చుసేయొచ్చు.

(Visited 7,257 times, 1 visits today)