Home / Inspiring Stories / కంట తడి పెట్టించే ఆరేళ్ళ పిల్లవాడి కథ.

కంట తడి పెట్టించే ఆరేళ్ళ పిల్లవాడి కథ.

Author:

ఆరేళ్ళ పిల్లవాడి కథ తల్లితండ్రులు six years boy wrote a letter to his parents

కొన్ని ఙ్ఞాపకాలు మనసులని కదిలిస్తాయి మనసుని కలచి వేస్తాయి. మరణం సహజమే కానీ ఆ మనిషి మిగిల్చే గుర్తులే మనల్ని బాధిస్తాయ్. అత్యంత అరుదైన వ్యాధికి గురై మరణించిన ఆరేళ్ళ పిల్లవాడు తన తల్లి తండ్రులకిచ్చిన ఒక ఙ్ఞాపకం మన మనసులనీ తడుముతుంది.ఓల్డేజ్ హోం లలో తల్లితండ్రులని వదిలేసే పిల్లలకో,పిల్లలని వారి భవిశ్యత్తు కోసమే అనే కారణం తో దూరంగా హాస్టళ్ళలో వదిలేసే తల్లి తండ్రులకో ఈ సంఘటణ బలంగా తాకుతుంది. కొద్ది క్షణాల పాటు మనం దూరం చేసుకుంటున్న ఆత్మీయతలనీ, అనుబందాలనీ గుర్తు చేస్తుంది……

లెలాండ్ షూమాక్ జార్జియాకి చెందిన ఆరేళ్ళ పిల్లవాడు అందర్లానే ఆడుతూ పాడుతూ పెరగాల్సిన ఆ చిన్నారికి ఐదేళ్ళ వయసులోనే మెదడుకు సంబందించిన అరుదైన ఇన్ ఫెక్షన్ సోకింది. మరణం తప్ప బతికే అవకాశమే లేదు.అతన్ని బతికించుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నించిన అతని తల్లితండ్రులు అతన్ని అధికంగా ప్రేమించటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.ఒక రోజు ఆఖరి రోజూ వచ్చేసింది.ఈ సెప్టెంబర్ 25 షూమాక్ విపరీతమైన తలనొప్పితో గదిలోనే దాదాపు రెండు గంటలు ఉండిపోయాడు. చివరికి చేతికి ఇంకు మరకలతో బయటికి వచ్చి పడిపోయాడు.ఆస్థితిలో అతన్ని చూసిన ఆ తల్లితండ్రులు విపరీతమైన భాదతో అతన్ని తీసుకుని హాస్పటల్ కి తీసుకు వెళ్ళారు కానీ అప్పటికే షూమేక్ మరణించాడని చెప్పారు డాక్టర్లు… అటునుంచి అటే సిమెట్రీకి తరలించారు.తమ చేతిలోని అతని శరీరం చెక్క పెట్టె లోకీ తర్వాత మట్టిలోకి వెళ్ళిపోయింది షూమేకర్ శరీరం….

రెండవ రోజున ఇంటికి చేరుకున్న ఆ తల్లితండ్రులు ఇంటికి చేరుకోగానే రాగానే తమ కుమారుడి గదిలోకి వెళ్ళిన వాళ్ళకి గుండేల్ని పిండేసే దృశ్యం కనిపించింది. ఆ ముందు రోజు షూమేకర్ తలనొప్పితో ఉండి కూదా ఒక కాగితం పై వేసిన స్కెచ్ చూసి తల్లడిల్లిపోయారు. ఆరోజు రెండు గంటలూ గదిలోనే ఉండిపోయిన షూమేకర్ తన అమ్మానాన్నలపై తన ప్రేమని చూపించే లా వేసిన చిన్న చిత్రం.. వారినే కాదు మనల్నీ ఎంతగా కదిలించి వేస్తుందో. “ఇంకా మీతో ఉన్నాను థాంక్ యూ అమ్మా నాన్న” అంటూ రాసిన ఆ పేపర్లో ఎరుపు మార్కర్ తో వేసిన హృదయం గుర్తులో అమ్మా,నాన్న గుడ్ డే అని రాసాడు… ఆరేళ్ళ షూ మేకర్ కి అమ్మానాన్నల మీద ఉన్న ప్రేమా వారితో కలిసి ఉండాలని అతనికి ఉన్న కోరికా. అతనిని గురించి తెలిసిన వారికి కంట తడి పెట్టిస్తున్నాయి..

(Visited 173 times, 1 visits today)