Home / Inspiring Stories / హైదరాబాద్ రోడ్ల పైకి బైక్ ట్యాక్సీలు..!

హైదరాబాద్ రోడ్ల పైకి బైక్ ట్యాక్సీలు..!

Author:

హైదరాబాద్ ట్రాఫిక్ లో ఆఫీసు కి వెళ్లి రావాలంటే దానికి మించిన కష్టం మరోటి ఉండదు, రోజురోజుకి ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి, ట్రాఫిక్ ని దాటి గమ్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టపడాలి, ట్రాఫిక్ సమస్యని అధిగమించలేక చాలా మంది క్యాబ్ ల ద్వారా ఆఫీసుకి వెళ్తున్నారు, కాని క్యాబ్ లలో వెళ్ళడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ ట్రాఫిక్ ఉంటే క్యాబ్ లో వెళ్ళిన కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోతం, ఈ ట్రాఫిక్ కష్టాలకి పుల్ స్టాప్ పెట్టడానికి హైదరాబాద్ కి చెందినా కొంతమంది కలిసి getmi (గెట్ మీ) అనే సంస్థను స్థాపించారు, వీరు క్యాబ్ టాక్సీల మాదిరిగానే బైక్ టాక్సీలను హైదరాబాద్ లో నడపనున్నారు, క్యాబ్ ని బుక్ చేసుకున్నట్టే బైక్ టాక్సీ ని కూడా బుక్ చేసుకోవచ్చు, ట్రాఫిక్ ఉన్నప్పుడు క్యాబ్ కంటే బైక్ మీద అయితేనే చాలా తొందంరగా గమ్యాన్ని చేరుకోవచ్చు.

get mi two wheeler taxi hyderabad

ఓలా, ఉబెర్ క్యాబ్ లని బుక్ చేసుకున్నట్టే బైక్ టాక్సీ లను కూడా యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి, ఈ బైక్ మీద వెళ్ళాలంటే మొదటి 3 కిలోమీటర్లకి కనీసం 20 రూపాయలని చెల్లించాలి, ఆ తరువాత ప్రతి కిలో మీటర్ కి రూ.4 చొప్పున వసూలు చేస్తారు, మొదటి ఐదు నిమిషాలకు ఎలాంటి వెయిటింగ్ చార్జ్ వర్తించదు. తర్వాత ప్రతి నిమిషానికి ఒక్క రూపాయి చార్జ్ చేస్తారు,వాహనం ఎక్కించుకున్న ప్రయాణీకుడి వివరాలతోపాటు, వాహన వేగం, వెళుతున్న మార్గం, దూరం, రవాణా ఛార్జి ఎప్పటికప్పుడు ప్రయాణికుడికి, పర్యవేక్షణ విభాగానికి చేరుతాయి. టూవీలర్ ట్యాక్సీ ద్వారా తక్కువ టైమ్ లో, సేఫ్ గా చేరాల్సిన చోటుకి తీసుకెళుతోంది. ఆడవారి కోసం ప్రత్యేకంగా మహిళ డ్రైవర్ లని నియమించుకున్నారు, డ్రైవర్ల నుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారి పూర్హి వివరాలను తీసుకుంటారు, ఇప్పుడు డ్రైవర్ లని ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇప్పటికే కొన్ని బైక్ టాక్సీలు సిటీ రోడ్ల పై తిరుగుతున్నాయి, త్వరలో మరికొన్ని బైక్ లు అందుబాటులోకి రానున్నాయి.రవాణా శాఖ నుంచి టూవీలర్స్ ను నాన్ ట్రాన్స్ పోర్టుగా వాడుకునేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ కూడా తీసుకున్నారు.

ప్రస్తుతం “గెట్ మీ” డ్రైవర్లంతా ఆరంజ్ కలర్ డ్రెస్సుల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మైండ్ స్పేస్, గచ్చిబౌలీ, మాదాపూర్, కూకట్ పల్లి ఏరియాల్లో బైక్ టాక్సీలు రన్ చేస్తున్నారు.ఒక్క బైక్ తో మొదలైన ఈ గెట్ మీ కంపెనీ ప్రయాణం ఇప్పుడు 50 బైక్ ల వరకు చేరుకుంది, త్వరలోనే ఇంకా ఎక్కువ బైక్ టాక్సీలని తిప్పుతామని తెలిపారు. ప్రజల భాగ్యస్వామ్యంతో, ప్రజల ఆవసరాలని తీర్చే ఏ ఐడియా అయిన ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని ఈ కంపెనీ వారు మరోసారి నిరూపించారు .

(Visited 1,150 times, 1 visits today)