Home / Entertainment / ఘాజీ మొదటి వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.

ఘాజీ మొదటి వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.

Author:

విభిన్న సినిమాల ద్వారా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌కావాల‌ని ప్ర‌య‌త్నించే అతి త‌క్కువ మంది వ‌ర్త‌మాన న‌టుల్లో ద‌గ్గుబాటి రానా ఒక‌రు. తను న‌టించిన సినిమాల జ‌యాప‌జయాల‌తో సంబంధం లేకుండా ఈ టాల్ హీరో ముందుకు సాగిపోతున్నాడు. చ‌రిత్ర సృష్టించిన బాహుబ‌లిలో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించి ఫ్యాన్స్ కి మ‌రింత చేరువైన రానా, తాజాగా ఘాజీ సినిమాతో స‌త్తా చాటాడు. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ ‘ఘాజీ’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా హౌసేఫుల్ కలెక్షన్లతో నడుస్తుంది. ఫిబ్రవరి 17 శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం ప్రజలందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఘాజీ సినిమా మొదటి వీకెండ్( మూడు రోజులు)లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందో చూద్దాం.

ఘాజీ మొదటి వీకెండ్ సినిమా కలెక్షన్స్: 

  • నైజాం-రూ.1.93 కోట్లు
  • సీడెడ్-రూ.27 లక్షలు
  • నెల్లూరు- రూ.11 లక్షలు
  • గుంటూరు- రూ.33 లక్షలు
  • కృష్ణా- రూ.40 లక్షలు
  • తూర్పు గోదావరి- రూ.25 లక్షలు
  • పశ్చిమ గోదావరి- రూ.16 లక్షలు
  • ఉత్తరాంధ్ర- రూ.1.80 కోట్లు

మొత్తం ఏపీ-తెలంగాణ వీకెండ్ షేర్ – రూ.4 కోట్లు.

  • తమిళనాడు- రూ.90 లక్షలు
  • కర్ణాటక- రూ.80 లక్షలు
  • రెస్ట్ ఆఫ్ ఇండియా-రూ.4.65 కోట్లు

మొత్తం ఇండియా వీకెండ్ షేర్ – రూ.10.35 కోట్లు.

యూఎస్ఏ వీకెండ్ షేర్- రూ.2.99 కోట్లు

ఘాజీ మొదటి వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్- రూ.13.6 కోట్లు.

ఆంధ్ర బాక్స్ ఆఫీస్ వారి ప్రకారం ఇదే సమయంలో ఈ సినిమా 23 కోట్ల పైచిలుకు గ్రాస్ సంపాదించింది.

(Visited 659 times, 1 visits today)